“ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్టే 151 బస్సులకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే విధంగా పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినే పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చింది.హైటెక్ సిటీలో ,పర్యాటక ప్రదేశాల్లో, జిల్లా కలెక్టరేట్లో దాదాపు 220 క్యాంటీన్లను మహిళా సంఘాలకు కేటాయించింది. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నందుకే ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి రికార్డు స్థాయిలో పంటలు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దేశ విస్తీర్ణంలో 11వ స్థానంలో ,జనాభాలో 12వ స్థానంలో ఉంది దేశ జీడీపీ లో 5శాతం వాటాను అందిస్తున్నది. దేశ జీడీపీ 9.9 శాతం ఉంటే రాష్ట్ర జిడిపి 10.1 శాతం ముందు నిలబడింది.రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.79 లక్షలకు చేరింది. దేశం అంతా యువ ముఖ్యమంత్రి రేవంత్ వైపు చూస్తున్నది.”
ఆరు దశాబ్దాలుగా నీళ్లు, నిధులు,నియామకాలు అంటూ రాష్ట్ర సాధన లక్ష్యంగా రోడ్లపైకి వచ్చిన సబ్బండ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒనగూరింది ఏమిలేదు. దశాబ్దకాలం పరిపాలించిన కేసీఆర్ కుటుంబం కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టులు, లిక్కర్, ఈ కార్ రేస్ రూపాలలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారనే భావం నుండి చతికలపడకుండా.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రేవంత్ దూరదృష్టి,సంకల్పంతో ప్రజాపాలన కొనసాగించడానికి రేవంత్ విజన్ ఆర్థిక, ప్రణాళిక,అభివృద్ధి,సహకారం నాలుగు స్తంభాలపై నిలబడి ఉంది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా మొదటి రోజు పవరింగ్ తెలంగాణ, ఎనర్జీ ట్రాన్సిషన్, క్లైమేట్ ఫైనాన్స్ అండ్ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ నెట్ జీరో అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో 2030నాటికి దేశంలో అత్యధికంగా విద్యుత్ బస్సులు తిరిగే నగరంగా హైదరాబాద్ ను మారుస్తాం. రెన్యువబుల్ ఎనర్జీ ఆర్ ఈ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 గిగావాట్లు పెంచడానికి రోడ్ మ్యాప్ తయారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 61 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్దకాలంగా నోచుకోని గ్రూప్1 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభించింది. కాంగ్రెస్ అంటే భరోసా ..కాంగ్రెస్ అంటే బ్రాండ్ అనేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం
తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంటరీ అగ్రదేశాలకు ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయం అంటే దండగ కాదని, పండుగ అని చేసి చూపించింది రాష్ట్రంలో రైతుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగిపోవడం వల్ల నీళ్లు ఎత్తిపోయలేదు ,కానీ రైతుల పంట తడి ఆరనివ్వలేదు.ఉచిత కరెంట్ కు రాజి పడలేదు అయితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే.రైతులందరికీ ఎకరాకు 12వేల చొప్పున ఖరీఫ్ సీజన్ లో గత సీజన్‌లో 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లను రైతు భరోసా, వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అన్నదాతలకు ఇచ్చి ఆదుకున్నది.రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో 25లక్షల మంది రైతులకు 20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసింది.
కాంగ్రెస్ వ్యవసాయ రంగాన్ని భుజాన ఎత్తుకున్నది. ఎరువులు, విత్తనాల అమ్మకంలో బ్లాక్ దందా చేసిన వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టింది, కేంద్రం నుండి రావాల్సిన యూరియా ఆలస్యం కాకుండా దిల్లీ కేంద్రంగా యుద్ధం చేసింది. అకాలంగా వచ్చిన వరదలతో రైతులకు భారీ నష్టం జరిగిందని గ్రహించి ప్రతి ఎకరాకు 10వేలు అందించింది. గత ప్రభుత్వం పదేళ్ల పాటు పేదలకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందించి పేదల ఆకలి తీరుస్తున్నది. ఈ దేశంలో వరి అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ మాత్రమేనని నిరూపించి హిమాలయ శిఖరాలను ముద్దాడింది.
ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచి, 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎలాంటి షరతు లేకుండా తెచ్చింది. గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. మహాలక్షి పథకంలో భాగంగా ఒకప్పుడు మహిళలు ఎక్కడికి వెళ్లాలన్ని ఛార్జీలకు ఇబ్బంది పడేవారూ, ఛార్జీ డబ్బుల కోసం భర్త మీద, పిల్లల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఉండేది, తెలంగాణ వ్యాప్తంగా సగటున రోజుకు 30లక్షల మంది ఈ పథకం వినియోగించుకుంటున్నారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న టిజిఎస్ ఆర్టీసీ ఈ పథకం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్నది.
ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్టే 151 బస్సులకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే విధంగా పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినే పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చింది.హైటెక్ సిటీలో ,పర్యాటక ప్రదేశాల్లో, జిల్లా కలెక్టరేట్లో దాదాపు 220 క్యాంటీన్లను మహిళా సంఘాలకు కేటాయించింది. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నందుకే ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి రికార్డు స్థాయిలో పంటలు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దేశ విస్తీర్ణంలో 11వ స్థానంలో ,జనాభాలో 12వ స్థానంలో ఉంది దేశ జీడీపీ లో 5శాతం వాటాను అందిస్తున్నది. దేశ జీడీపీ 9.9 శాతం ఉంటే రాష్ట్ర జిడిపి 10.1 శాతం ముందు నిలబడింది.రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.79 లక్షలకు చేరింది. దేశం అంతా యువ ముఖ్యమంత్రి రేవంత్ వైపు చూస్తున్నది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో కులగణన చేసి, శాసనసభలో తీర్మానం చేసి, బిసిల పక్షాన నిలిచింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు పోవడం బీసీ సమాజం తప్పుబట్టిన, దానికి ఆర్థిక పరమైన కారణాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిజర్వేషన్ల అంశం తేలేందుకు రాహుల్ పార్లమెంట్ కేంద్రంగా కొట్లాడితేనే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు మునుపెన్నడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డమీద అడుగుపెట్టి అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు జీఓ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా ఉన్నత విద్య వారి సంకల్పం, దార్శనికత ప్రతిరూపంగా భావించాలి.
తెలంగాణ లోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లు, వ్యవసాయ కళాశాలల మంజూరు, గద్దర్ అవార్డులు, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, ప్రపంచ సుందరి అందాల పోటీలు నిర్వహించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ నలుమూలల పరిచయం చేయడం, బతుకమ్మ కుంట బాగు చేయడం కాంగ్రెస్ నవీన ఆలోచనలకు నిలువుటద్దం. తెలంగాణ లో సొంతిళ్ళు లేని కుటుంబం ఉండొద్దు అని ఇందిరమ్మ ఇండ్లు, ఎప్పుడు వరదలతో సతమతం అవుతున్న హైదరాబాద్ ను విశ్వనగరంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు హైడ్రా వంటి ప్రతిష్టాత్మకమైన మరెన్నో నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇంటింటికి చేరేలా చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేవంత్ ప్రతి అడుగు తెలంగాణ కోసమే పడాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.





