‌ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

  • రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజు
  • 500 రూపాయలకే ఎల్‌పీజీ వంట గ్యాస్‌:‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17:‌ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట తో కలిసి మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌, ‌కమిషనర్‌ ‌పోలీసుల వందనం స్వీకరిం చారు. ఈ సందర్భంగా మేయర్‌ ‌మాట్లాడుతూ… భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడాదైనా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ జాతి చేసిన పోరాటం, రాజరిక పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్‌ 17 అని తెలిపారు. తెలం గాణ ప్రజల స్వయం పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికలు రచించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువలో తీసుకుపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.ప్రజాపాలన కార్యక్రమ ంలో 6 గ్యారంటీల అమలుకు ప్రజలు అర్జి పెట్టుకొనేందుకు అవకాశం ఇచ్చారని, ఆ దరఖాస్తుల పరిశీలన చేసి అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వ ప్రయోజనం పొందుటకు యోగ్యత కల్పించారని తెలిపారు.

ముఖ్యంగా 500 రూపాయలకే ఎల్‌పీజీ వంట గ్యాస్‌ ‌తో పాటుగా పేద ప్రజలకు విద్యుత్‌ ‌బిల్లుల చెల్లింపు భారం అవుతుందనే ఉద్దేశ్యంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించి, మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రవాణా బస్సు  సౌకర్యం కల్పిం చిందని తెలిపారు. మహిళలకు, విద్యార్థి లోకానికి,ఒక అన్న య్యగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒకే ఒక్కడని మేయర్‌ ‌తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా జిహెచ్‌ఎం‌సి వ్యాప్తంగా 28 డిసెంబర్‌ 2023 ‌నుండి 6 జనవరి 2024వరకు నిర్వహించడం జరిగిం దని, ఈ సందర్భంగా ఒక వార్డులో 4 కౌంటర్లు ఏర్పాటు చేసి ఇందులో మహిళలకు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు లబ్ధి చేకూరే పథ కాల అమలు కోసం దరఖాస్తు స్వీకరించడం జరిగిందని తెలిపారు. 150 వార్డులలో 600 కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 వేల మంది సిబ్బందితో పాటుగా వాలంటీర్లను వినియోగించడం జరిగిందని, కౌంటర్‌ ‌వద్దకు వచ్చిన ప్రతి దరఖాస్తును తీసుకొని, సర్కిల్‌ ‌వారీగా కంప్యూటరైస్‌ ‌చేయడమైనది తెలిపారు.

ప్రజా పాలనలో 26,48,521 కుటు ంబల నుండి 24,74, 325 దరఖాస్తులను స్వీకరించడం జరిగిం దని,అందులో అభయహస్తం 19,01, 256 దరఖాస్తులు స్వీకరిం చడం జరిగిందని,  స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులో సవరణ కోసం 30 సర్కిల్లోని వార్డు కార్యాలయాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులైన వారికి అభయహస్తం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా పాలన కోసం ప్రతి జిల్లాలో ప్రభుత్వ సెలవు మినహా ప్రతి సోమవారం జిహెచ్‌ఎం‌సి లో కూడా ప్రజావాణి నిర్వ హించి అధికారుల భాధ్యతతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎప్పటికీ ఉండాలని మేయర్‌ ‌కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్‌ ‌పల్లి, ఎల్బీనగర్‌ ‌జోనల్‌ ‌కమిషనర్లు అపూర్వ్ ‌చౌహన్‌, ‌హేమంత్‌ ‌కేశవ్‌ ‌పాటిల్‌, అడిషనల్‌ ‌కమిష నర్లు యాదగిరి రావు, నళిని పద్మావతి, పంకజ, సరోజ, సి సి పి శ్రీనివాస్‌, అడి షనల్‌ ‌సిసిపి గంగాధర్‌, ‌విజిలెన్స్ అడిషనల్‌ ఎస్‌.‌పి శ్రీనివాస్‌, ఎ.‌సి.పి సు దర్శన్‌,   ‌సి.ఎం అండ్‌ ‌హెచ్‌.ఓ ‌డా. పద్మజ, జాయింట్‌ ‌కమిషనర్లు ఉమా ప్రకాష్‌, ‌జ యంత్‌, ‌మహేష్‌ ‌కులకర్ణి, చీఫ్‌ ఎం‌ట మాలజిస్ట్ ‌డా. రాంబాబు, ఎస్‌.ఈ ‌రత్నాకర్‌, ఆయా విభాగాల ఉన్న తాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
– సిపిఆర్‌ఓ ‌జిహెచ్‌ఎం‌సి ద్వారా జారీ చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page