హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ

– మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: అధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ¾) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యాబ్స్ స్థానిక ఆరోహన్ గ్లోబల్ కన్సల్టింగ్‌తో కలిసి ఈ జీసీసీని నెలకొల్పుతోంది. ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందం సచివాలయంలో శ్రీధర్‌బాబుతో గురువారం భేñటీ అయింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తమ విస్తరణ కార్యక్రమాలను వివరించారు. జీసీసీ¾ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. ‘గత ఏడాది కాలంలో 80 జీసీసీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి.. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, చక్కని ఎకో సిస్టం ఉండటం వల్ల వాటిని ఆకర్షించగలుగుతున్నాం.. డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు కూడా తెలంగాణ ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.. నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ మానవ వనరులు, పటిష్టమైన డిజిటల్ మౌలిక వ్యవస్థ, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, వేగంగా విస్తరిస్తున్న తయారీ రంగం, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జీసీసీలకు అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దాయి’ అని పేర్కొన్నారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొటోటైపింగ్, తయారీ రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అధునాతన ఇంజినీరింగ్, డిజిటల్ తయారీ సాంకేతికతలు, ఉత్పత్తి అభివృద్ధి రంగాల్లో విస్తృత కార్యకలాపాలు సాగనున్నాయన్నారు. దీంతో హైదరాబాద్ హై వ్యాల్యూ తయారీ రంగంలో మరింత శక్తివంతంగా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రోటోల్యాబ్స్ రాకతో స్థానిక స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎసఎంఈలు), పెద్ద పరిశ్రమలకు ప్రోటోటైపింగ్ తయారీ సదుపాయాలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి మరింత వేగంగా తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని, చైనాపై ఆధారపడే అవసరం తగ్గిపోతుందని చెప్పారు. ప్రోటోల్యాబ్స్ బృందంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డాన్ షూమాకర్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అగ్నెస్ సెమింగ్టన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ కెర్మిష్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ శర్మలు ఉన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ కూడా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *