– జంతర్ మంతర్ వద్ద ధర్నాకు యత్నం
– సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
– పలువురు ఆప్ నేతల అరెస్ట్
న్యూదిల్లీ, అక్టోబర్ 2: సీఈసీ జానేష్ కుమార్ రాజీనామా. కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐఎం, ఏఐఎస్ సహా వివిధ పక్షాల నేతలు, యువత శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 1100 మందికిపైగా కార్యకర్తలు, నేతలను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ పక్షాలకు చెందిన కీలక నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ కీలక నేతలు, దిల్లీ మాజీ సీఎం అతిషి, సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా, సంజయ్ సింగ్, ఏఐఎస్ఏ ఉద్యమకారినణి నేహా బోరా, సీపీఐఎం సీనియర్ లీడర్ బృందాకారత్ సహా పలువురు నేతల్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు కూడా ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లగా వారిని కూడా అరెస్టు చేశారు. జంతర్ మంతర్ ప్రాంతానికి వెళ్లేందుకు అనేక చోట్ల రహదారుల్ని మూసివేశారు. అయినప్పటికీ వందల మంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. జంతర్మంతర్ వద్దకు కీలక నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




