– సర్కార్ పచ్చ జెండా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ పక్రియ సాగనుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 12 నుంచి అమలులోకి రానున్నాయి. దీనివల్ల వేలమంది అధికారులకు లబ్ది చేకూరడమే కాక గ్రామాల్లో పాలన మరింత పటిష్టం కానుంది. అధికారులు వెంటనే ఈ పక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




ప్రజల కష్టాలు చూసి పైశాచికానందమా?