ప్రజల కష్టాలు చూసి పైశాచికానందమా?

– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు
– ‘శాడిస్టిక్ ప్లెజర్’ వ్యాఖ్యలపై కేటీఆర్ నిప్పులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజలు, ప్రతిపక్షాలు తిడుతుంటే తనకు శాడి స్టిక్ ప్లెజర్ వొస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగా ల్లో మోసపోయిన ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలతో అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే తనకు సంతోషం కలుగుతుందంటూ రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా రేవంత్ రెడ్డికి ఏ బాధ కలగడం లేదన్నారు. కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా లేదా అని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించా రు. రైతుల ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా లేదా అని ప్రశ్నించారు. ఇలా అన్ని  ర్గాల ప్రజలు బాధలు పడుతుంటే వారి బాధలను చూసి ప్రభుత్వాన్ని మేము తిడితే ప్రతిపక్షాల తిట్లతో తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందని, పైశాచిక ఆనందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు. ప్రతిసారి నేను మారిన మనిషిని అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి యథావిధిగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ రెడ్డి విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. విద్యార్థులు కాలేజీ చదువులకు దూరమయ్యే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొన్నదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన మంచి పథకమని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగించిందన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కాలేజీలకు రాకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థు ల కాలేజీ చదువులు అంధకారంలో కూరుకు పోయినా కూడా ప్రభుత్వానికి సిగ్గు అని పించ డం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యారంగానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి గురుకుల పాఠ శాలల నుంచి ఫీజు రీయింబ ర్స్మెంట్ వరకు అన్ని రంగాల్లో విద్యార్థు లకు అండగా నిలిచిం దన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు పూర్తిగా ఆగిపోయిందని, చివరికి రైత న్నలకు యూరియా బస్తాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. పండించిన ధాన్యం తో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయ కుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ దన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మక్క లు, శనగలు, జొన్నల వంటి పంటల కొను గోళ్లు దాదాపుగా నిలిచిపోయాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, రై స్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవ లం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నారని అన్నా రు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పు కుంటూ కనీసం మహబూబ్నగర్ జిల్లాకైనా ఒక్క మంచి పని చేశాడా అన్న విషయాన్ని ప్ర
జలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. కేసీ ఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడ ని, కేసీఆర్ పరిపాలన గురించి  ఏ పల్లెను అడిగినా చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో అమలు చేస్తానని చెప్పి, 30 నెలల తర్వాత కూడా అవి అమలు చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఆ పథకాలను గాని, ఆ వ్యక్తిని గాని ఏమనాలి అని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజె క్టుల్లో కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టులో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడం లేదని కేటీఆర్ అన్నారు. కేసీ ఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టు కావడంతో దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతుబంధును పక్కనపెట్టి ‘ రాహుల్ బంధు’ అమలు చేస్తున్నారు.ప్రతిసారి అప్పుల కారణంగా అభివృద్ధి చేయ లేమని సాకులు చెబుతున్నారని, కానీ గత ప్రభుత్వం తెచ్చిన ప్రతి అప్పు ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మూడు లక్షల 80 వేల కోట్ల అప్పు తీసుకుని ఒక్క రూపాయి పనీ చేయలేదన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి రైతుబంధు వంటి పథకాలను పక్కనపెట్టి ‘రాహుల్ బంధు’ను మాత్రం జోరుగా నడిపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా, ఈరోజు రియల్ ఎస్టేట్ భూముల ధరలు పడిపోయి రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యత రగతి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం భూములు కొనుగోలు చేసిన మధ్యతరగతి వర్గాలు కూడా ఈరోజు ఆందోళనలో కూరుకుపోయాయని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా 25 సంవత్స రాల పాటు ప్రజలతో, వారి ఆకాంక్షలతో నిలబడి తెలంగాణ సాధించి 25 సంవత్స రాలు పూర్తి చేసుకున్న పార్టీ బీఆరఎస్ అని కేటీఆర్ అన్నారు. అధికారం ఉన్నా, ప్రతిప క్షంలో ఉన్నా ప్రతిసారి ప్రజల పక్షంగానే ఉంటామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *