– ఖైదీలను సరిదిద్దే ప్రధాన బాధ్యత ఆ శాఖదే
– దిల్లీ జైలు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి
– దిల్లీ జైలు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: జైళ్ల శాఖ పాత్ర సమాజానికి అత్యంత ముఖ్యమని, ఇది సులభమైన పని కాదని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. జైలు సేవ అనేది కేవలం నాలుగు గోడల మధ్య తాళాలు వేసే పని కాదని, అది ఖైదీలను సరిదిద్దుతూ సమాజంలో తిరిగి కలిపే బాధ్యత అని చెప్పారు. శిక్షణార్థులు క్రమశిక్షణ, నిష్పక్షపాతం, వృత్తిపరమైన నైపుణ్యాలను పాటిస్తూ ఖైదీలను గౌరవంతో చూడాలని సూచించారు. దిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రరాథమిక ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని చంచల్‌గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్టేష్రన్ (సికా)లో డీజీపీ బుధవారం ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమం రాష్ట్రాల మధ్య సమన్వయం, సంస్కరణ పాలనలో పరస్పర సహకారానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 2026లో మొత్తం 381 మంది దిల్లీ జైళ్ల సిబ్బంది దశలవారీగా శిక్షణకు ఎంపిక కాగా నేటి మొదటి దశలో 62 మంది శిక్షణార్థులు పాల్గొంటున్నారు. వీరిలో 61మంది దిల్లీ జైళ్ల శాఖకు చెందినవారు, ఒకరు తెలంగాణ జైళ్ల శాఖ వార్డర్ ఉన్నారు. తొమ్మిది నెలల సమగ్ర శిక్షణ కార్యక్రమం శిక్షణార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మానవతా దృక్పథాన్ని పెంపొందించేలా రూపొందించారు. ఇందులో భాగంగా అంతర్గత శిక్షణ, జైలు నియమాలు, క్రిమినాలజీ, విక్టిమాలజీ/పెనాలజీ, సైకాలజీ, సోషియాలజీ/సోషల్ వర్క్, క్రిమినల్ చట్టాలు, రాజ్యాంగ విలువలు/మానవ హక్కులు, జైలు పరిపాలనలో సాంకేతికత, బాహ్య శిక్షణ, శారీరక వ్యాయామం, బీపీ¾ఆర్/డి ప్రమాణాల ప్రకారం పరేడ్, యోగా/ధ్యానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ శిక్షణ, అంతర్రాష్ట్ర సహకారం సంస్కరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకమని పేర్కొన్నారు. దిల్లీ జైళ్ల డైరెక్టర్ జనరల్ సికాపై విశ్వాసం ఉంచి ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బందిని శిక్షణకు పంపడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ప్రజల కష్టాలు చూసి పైశాచికానందమా?