హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలు, బోగీల్లో చెత్త వేసినా, ఉమ్మినా అధికారులు ఇకపై రూ.1,000 వరకు జరిమానా విధించనున్నారు. గతంలో ఈ జరిమానా రూ.500 ఉండేది. ఈనెల 24 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. జరిమానా చెల్లించని వారిపై కోర్టు రూ.2,000 వరకు అదనపు ఫైన్ విధించే అవకాశం ఉంది. స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్లు ఈ జరిమానాను వసూలు చేస్తారు. రైల్వే ఆస్తులను కాపాడటంతోపాటు స్టేషన్లు, రైళ్లలో పరిశు భ్రతను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





