తల్లిదండ్రులను చంపిన యువతి ఆత్మహత్య

– వారికిచ్చిన్న మత్తుమందుతో తనూ బలవన్మరణం

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌ప్రేమించిన ప్రియుడి కోసం తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి హతమార్చిన సురేఖ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను పొట్టనపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్‌తోనే తన ప్రాణం కూడా తీసుకుంది. వికారాబాద్‌ ‌జిల్లా బంట్వారం మండలంలోని యాచారం గ్రామానికి చెందిన సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఓ యువకుడిని ప్రేమించింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. ప్రేమ పెళ్లి కుదరదని వారించారు. దీంతో తల్లిదండ్రులపై ఆగ్రహం పెంచుకున్న సురేఖ ఇంజక్షన్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి వారిని కడతేర్చింది. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులకు సురేఖపై అనుమానం రావడంతో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. అరెస్టయిన సురేఖ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చింది. తిరిగి సంగారెడ్డికి వెళ్లిన ఆమె శాంతినగర్‌లో ఓ ప్రైవేట్‌ ‌హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *