హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

– స్వాగతం పలికిన గవర్నర్‌, ‌సీఎం, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఒక రోజు పర్యటనకు  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ‌బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ముర్ముకు స్వాగతం పలికారు. అలాగే రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ ‌రెడ్డి, హైదరాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌దాసరి హరిచందన, హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌, ‌తదితరులు ఉన్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి శనివారం పుట్టపర్తి వెళ్లనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page