ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర

*ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర
– రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు
ప్రజాతంత్ర  దినపత్రిక క్యాలెండర్- 2025 ను ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు మంథని లో ఆదివారం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి,ప్రజలకు దోహదపడే వార్తలు రాస్తూ ప్రజాహితం కోసం పనిచేసే పత్రిక ప్రజాతంత్ర అని అన్నారు.ఇలాగే సమాజ హితం కోసం ప్రజాతంత్ర దినపత్రిక పనిచేస్తూ దినదినాభివృద్ధి చెందాలని  ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో ముత్తారం ప్రజాతంత్ర రిపోర్టర్ చెల్కల యుగేందర్  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్దెల రాజయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినీత్,మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్,మండల మైనార్టీ అధ్యక్షులు వాజీద్ పాషా,ముత్తారం పిఎసిఎస్ చైర్మన్ యాదగిరిరావు,తాజా మాజీ సర్పంచులు తూటి రజిత రఫీ,బక్కారావు,సంపత్ రావు,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బియ్యని శివకుమార్,చెల్కల జితేందర్,కోల విజయ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *