మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం
ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే హరీష్‌రావు క్యాలెండర్‌ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకం అని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర మరువలేనిదనీ కొనియాడారు. మీడియా రంగం చాలా ఉధృతంగా విస్తరిస్తుందనీ, పత్రికకు సాంకేతికతను అందింపుచ్చుకుని మరింత సందేశాత్మక రీతిలో ఉపయోగపడాలన్నారు. 27వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక మరింత చేరువకావాలని అభిప్రాయపడ్డారు. ప్రజాతంత్ర దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దమన్నారు. సామాజిక అంశాలతో ప్రజలను చైతన్యం చేసే దిశగా పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. పత్రికలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పజాతంత్ర దినపత్రిక అనునిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వాలకు అనుదినం జన స్వరం వినిపించే పత్రిక ప్రజాతంత్ర అన్నారు. ప్రజల సమస్యలపై అధికార యంత్రాంగానికి చేరవేయడంలో ప్రజాతంత్ర ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. ఇలాంటి పత్రికలు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. సమాజంలో పత్రికలతో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజం పట్ల పత్రికలు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక 27 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభపరిణామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటాన్ని సాగిస్తున్న ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర వక్తలు మాట్లాడుతూ…ప్రభుత్వానికి ప్రజలకు మధ& పత్రికలు వారధిగా పని చేస్తాయనీ, అందులో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు, పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలన్నారు. ఏ అధికారిగానీ రాజకీయ నేతలకు గానీ భయపడకుండా నిర్భయంగా, నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు. ప్రజలకు బలం పత్రికలు అన్నారు. అందుకే ప్రజల పక్షాన నిలిచే ‘ప్రజాతంత్ర’ పత్రిక ప్రజలకు అన్ని వేళలా అండగా ఉండగలదన్న ఆశాభావాన్ని పలువురు వక్తం చేస్తూ…27వసంతాలు పూర్తి చేసుకున్న ‘ప్రజాతంత్ర’ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ క్యాలండర్‌ ఆవిష్కరణలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, కొండం సంపత్‌రెడ్డి, కాముని ఉమేష్‌చంద్ర, కొండం రవీందర్‌రెడ్డి, గుడాల శ్రీకాంత్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్టు తోట అశోక్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *