– ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు
– ఎల్ నినో ప్రభావం, కరువు పరిస్థితులపై సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్యలు తీవ్రతరం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచఆర్డీలో ఉన్నతాధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితిని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతోపాటు ఇతర అవసరాలకు ఎస్టీపీలు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పశుసంపద సంరక్షణతోపాటు పశుగ్రాసానికి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఎల్నినో ఒక విపత్తు.. ఈ విపత్తుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతీ మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులను నియమించి పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని సూచించారు. సంబంధిత మండలంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎల్ నినో ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





