సింగరేణి చరిత్రను చీకటి చేసిన కాంగ్రెస్

– కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది
– కరెంటు కోతకు సింగరేణి బాధ్యున్ని చేస్తే ఎట్లా
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

గోదావరిఖని, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : చీకటి గుహల్లో రక్త తర్పణం చేసి, చావుతో సహవాసం చేసే సింగరేణి బిడ్డల త్యాగాలతో దేశానికి వెలుగులు నింపుతుంటే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తక్కువ ఉండడం వలన కరెంటును ఉత్పత్తి చేయలేకపోతున్నాను అని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం కార్మికులను అవమాన పరిచినట్టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి కార్మిక గర్జన పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో  ఉన్న విద్యుత్ కొరతను అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేసి నిరంతర విద్యుత్ని అందించారాని గుర్తు చేశారు. కరెంటు కోతకు ఒగ్గు ఉత్పత్తి కొరతనే అని కార్మికులపై నెపం వేసేందుకు కూడా వెనుకాడని రేవంత్ రెడ్డికి సింగరేణి బిడ్డలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 60 వేల కోట్ల బాకీ సింగరేణికి విద్యుత్తు సంస్థలు ఉన్నాయని వాటిని రికవరీ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శించారు.  సింగరేణిలో 40 లక్షల బొగ్గు మాయం అయిపోయిందని ఆరోపించారు. బీఆర్ ఎస్, టీబీజీకేఎస్ నాయకులు క్షేత్రస్థాయికి వెళ్తే అడ్డుకున్నారని విమర్శించారు. 2023 కెసిఆర్ హయాంలో బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు అయితే గతేడాది 50 మిలియన్ టన్నులు బొగ్గు మాత్రమే  ఉత్పత్తి చేశారని అన్నారు. ఈ బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి కార్మికుడు కారణం కాదని కేవలం ప్రభుత్వ అసమర్థతనేనని వివరించారు. ఓపెన్ కాస్ట్ లో ఓబిని వెలికి తీసేందుకు కలిగే ఆలస్యం ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కారణమని ఆరోపించారు. ఓబి టెండర్లు ఏడుసార్లు వాయిదా పడడం కేవలం వారి మధ్య అవగాహన కుదరకపోవడం, వాటాలు సెట్ కాకపోవడమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్ లా తయారైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభ మేళ నిర్వహిస్తుందని మండిపడ్డారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి గురించి 49 శాతం వాటా ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే అతను రేవంత్ రెడ్డికి జరుగుతున్న అవినీతి గురించి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి అవగాహనన అని ప్రశ్నించారు.
రైతులు, సింగరేణి కార్మికులు ప్రజలు చతికిలమవుతుంటే రేవంత్ మాత్రం రాహుల్ గాంధీకి ఈఎంఐ కట్టుకుంటూ తన పదవిని కాపాడుకుంటున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచకుండా రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. మూడేళ్లుగా సింగరేణి కార్మికులకు సరైన లాభాల వాటా ఇచ్చేందుకు వెనుక ముందు చేస్తున్న రేవంత్ కు ఫుట్బాల్ సరదా కోసం కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం వీలవుతుందని ఎద్దేవా  చేశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి బాగోతం గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు చేసిన అరాచయకాల మూలంగానే సింగరేణి కార్మిక సమాఖ్య ఉద్భవించిందని తుపాకులు చేతపట్టారని గుర్తు చేశారు. సింగరేణి గోదావరిఖని ఉద్యమాల గడ్డ అని ఇక్కడి నుండి హామీ ఇస్తున్నట్లు కార్మికులకు తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు ఇండ్ల పట్టాలు కెసిఆర్ తోనే సాధ్యమని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో సింగరేణి ఫర్ సేల్ అనేలా కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గంగుల కమలాకర్, నడిపెల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, పుట్ట మధు, పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *