పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలి

– నిషేధిత జాబితా భూములకు నైతిక బాధ్యత వహించాలి
– సారీలు చెప్పి సరిపుచ్చుకోవడం కుదరదు
– బాధితుల కోసం జనతా గ్యారేజ్‌ ‌తెరిచే ఉంటుంది
– బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు డిమాండ్‌
‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగ స్టు 18 : భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ ‌నేత హరీష్‌ ‌రావు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ‌చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పొంగులేటి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ న్యాయబద్ధంగా, కష్టార్జితంతో సంపాదించిన భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఫోన్‌ ‌చేయాలంటూ ప్రభుత్వం టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ ఇచ్చిందని, అయితే ఆ నెంబర్‌ ‌పనిచేయడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ ‌పనిచేయకపోయినా మా జనతా గ్యారేజ్‌ అం‌టే తెలంగాణ భవన్‌  ‌తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను హైడ్రా కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు జనతా గ్యారేజ్‌ ‌తలుపు తట్టారని, అప్పుడు వాళ్లకు న్యాయం చేశామని అన్నారు. అలాగే నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై హరీష్‌ ‌రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు. రాత్రికి రాత్రే కాలనీల్లో ప్రభుత్వం అమ్మిన భూములు, హెచ్‌ఎం‌డీఏ అమ్మిన భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని మండిపడ్డారు. మీ తప్పులకి ప్రజలకు ఎందుకు శిక్ష అని అన్నారు. మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి జిల్లాలు తన చేతిలోకి రావాలని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అధికారులు తప్పు చేశారు.. సారీ అని పొంగులేటి చెప్తే సరిపోతుందా? ఇది 30 శాతం గవర్నమెంట్‌.. ఏ ‌పని కావాలన్నా 30శాతం కమీషన్‌ అడుగుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రేవంత్‌ ‌రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాలో ఉందని.. మరి సీఎం ఎక్కడ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నారో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్‌ ‌చేశారు. నిషేధిత భూములతోపాటు ప్రభుత్వ భూములు, అసైన్మెంట్‌ ‌భూములను కాజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నిషేధిత జాబితాల నుంచి తొలగించిన భూముల లిస్ట్‌ను పబ్లిక్‌ ‌డొమైన్‌లో పెట్టాలన్నారు. అధికారులూ జాగ్రత్త.. మీరు తప్పు చేస్తే రేపు మీరే బలవుతారని హెచ్చ‌రించారు. కమీషన్ల కోసం పెన్ను పోటుతో ప్రజల జీవితాలను బలి చేయొద్దు.. ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా నిషేధిత భూములపై ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ ‌నిలదీస్తుంది.. ప్రజలకు అండగా ఉంటుంది అని స్ప‌ష్టం చేశారు.
———————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *