‘మూసీ’ తొలి దశ పనులకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9 :మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ‌తొలి దశ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. మూసీ రివర్‌‌ఫ్రంట్‌ ‌ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌-1ఏ, ‌జోన్‌-1‌బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్‌సాగర్‌ ‌నుంచి బాపూఘాట్‌ ‌వరకు 9.20 కి.మీ, ఉస్మాన్‌సాగర్‌ ‌నుంచి బాపూఘాట్‌ ‌వరకు 11.80 కి.మీ మేర అభివృద్ధి పనులు కొనసాగనున్నాయి. మొత్తం 21 కి.మీ ప్రాధాన్య స్ట్రెలో రివర్‌‌ఫ్రంట్‌ ‌పనులు జరుగనున్నాయి. భూసేకరణ వ్యయం మినహా రూ.7,345.12 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూసీ రివర్‌‌ఫ్రంట్‌ ‌పనులను ఈపీసీ  విధానంలో నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రాజెక్ట్ ‌మేనేజ్‌మెంట్‌ ‌కన్‌స్టలెన్సీ నియామకానికి సర్కార్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్‌ఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *