– ఫేక్ లేఖగా గుర్తించిన కేంద్ర సంస్థ పిఐబి
– అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
న్యూదిల్లీ, జూలై 30 : ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్దారించింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అలాంటి లేఖ ఏదీ విడుదల కాలేదని, మోదీ కూడా దానిపై సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఈ ఫేక్ లెటర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారిక వర్గాల నుంచి నిర్దారణ చేసుకోకుండా ఇలాంటి సందేశాలను నమ్మకూడదని, ఫార్వర్డ్ చేయకూడదని ‘ఎక్స్’ వేదికగా పీఐబీ సూచించింది. ‘ప్రధాని సంతకంతో ప్రచారంలో ఉన్న లేఖ పూర్తిగా ఫేక్. తప్పుడు పత్రాలు, నకిలీ మెసేజ్ల ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం, తప్పుగా ప్రచారం చేయడం, కొన్ని సందర్భాల్లో ఆర్థిక మోసాలకు పాల్పడటం జరుగుతుంది’ అని తెలిపింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని, పెట్టుబడుల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని పీఐబీ పౌరులకు సూచించింది అనుమానాస్పద పోస్టులు, నకిలీ పత్రాలు కనిపిస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందానికి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది. కృత్రిమ మేధ ఆధారిత నకిలీ కంటెంట్, ఫోర్జరీ పత్రాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ సమాచారాన్నైనా అధికారిక వర్గాలు ధ్రువీకరించాకే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


