వృద్ధులకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు

– ‘ప్రణామ్’ ప్రారంభించిన ఆస్టర్, కేర్ హాస్పిటల్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: దేశంలో వృద్ధుల జనాభా ప్రస్తుతం 15 కోట్లను దాటగా, రానున్న దశాబ్దంలో ఈ సంఖ్య మరింత వేగంగా పెరగనున్న నేపథ్యంలో, వృద్ధులకు మరింత సులభమైన, వ్యక్తిగత అవ సరాలకు అనుగుణమైన, ఆత్మీయ ఆరోగ్య సేవలను అందించేందుకు అస్టర్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా ప్రణామ్’ పేరు తో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆసుపత్రిలో చికిత్సతోనే పరిమితం కాకుండా, వృద్ధులకు నిరంతర ఆరోగ్య సంరక్షణ, మాన సిక భరోసా, సంరక్షకులకు సహకారం. ఆరో గ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించే లక్ష్యం తో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలంగాణలోని అన్ని కేర్ హాస్పిటల్స్, అస్టర్ హాస్పిటల్స్ ల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో అస్టర్ డీఎం క్వాలిటీ కేర్ ఇండి యా-II నెట్వర్క్ ఈ కార్యక్రమాన్ని అమ లు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలి చింది. అనంతరం దశలవారీగా ఇండియా-II పరిధిలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. వృద్ధుల ఇ బృందులను దృష్టిలో పెట్టుకుని, ఆసుపత్రికి రాకముందు నుంచి చికిత్స పూర్తైన తర్వాత కూడా ప్రతి దశలో వ్యక్తిగత సహాయాన్ని అం దించేలా ప్రణామ్ కార్యక్రమాన్ని రూపొందిం చారు. ప్రణామ్ వృద్ధుల సమగ్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రత్యేక కా ర్యక్రమం. ఇందులో వృద్ధులకు ప్రత్యేక సహా యక సేవలు, ప్రాధాన్య వైద్య సేవలు, సంరక్ష కులతో కలిసి వైద్య సంప్రదింపులు, సమాచా ర వ్యవస్థ, చికిత్స అనంతర ఫాలోఅప్ సేవలు. ప్రత్యేక ప్రణామ్ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా అస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ (ఇండియా-II) సీఈఓ డా. పవన్ కుమార్ మాట్లాడుతూ. “ప్రణామ్ ద్వారా మా ఇండియా-II నెట్వర్క్ ని ప్రతి అస్టర్, కేర్ హాస్పిటల్స్ ని వృద్ధులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు వేస్తున్నాం. ప్రతి వృద్ధుడు తన ఆరోగ్య ప్రయా ణంలో గౌరవం, భరోసా, సంపూర్ణ సంరక్షణ ను అనుభూతి చెందేలా ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం” అని అన్నారు. హైదరాబాద్ కలెక్టర్ డా.ప్రియాంక అల, మా ట్లాడుతూ. ” ప్రణామ్ వంటి కార్యక్ర మాలు వృద్ధుల గౌరవం, నిరంతర ఆరోగ్య సంరక్షణ, మానసిక భరోసా, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం పై దృష్టి సారించడం ద్వారా ప్రభుత్వం ప్రయ త్నాలకు తోడ్పడతాయని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ డిస్ట్రిక్ట్ గవ ర్నర్ నరసింహరాజు దిచ్పల్లి మాట్లాడుతూ, ” ప్రణామ్ వృద్ధులు విలువైనవారిగా, జీవించే లా ఒక సహాయక వాతావరణాన్ని సృష్టిస్తోం దన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక అల, ముఖ్య అతిథిగా, లయన్స్ క్లబ్స్ ఇంటర్నే షనల్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరసింహరాజు దిచ్పల్లి గౌరవ అతి థిగా పాల్గొని కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అస్టర్ డీఎం క్వాలిటీ కేర్. లిమిటెడ్ సీఈఓ (ఇండియా-II) డా. పవన్ కుమార్, ప్రెసి డెంట్ సేల్స్ & మార్కెటింగ్ శలభ్ డాంగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభ వ్ జోషి, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డా. అమిత్ సింగ్ , రీజినల్ సీఈఓ నీలేశ్ గుప్తా, వైస్ ప్రెసి డెంట్- నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ డా. విన్సీ అశో క్ త్రిభువన్, ఆరోగ్యనిపుణులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *