– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. బహిరంగ సన్నాహాల్లో భాగంగా తార్నాకలో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌లో రామచందర్‌రావు పాల్గొన్నారు. గోడపై కమలం పువ్వును చిత్రించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే నరేంద్ర మోదీ భారత దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలకాలని కోరారు. బెంగాల్‌లో వంద సీట్లలో ఓట్ చోరీ జరిగిందని మమత అంటున్నారు.. దీనికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపాడు.. ఓటు చోరీ చేసేటోళ్లే చోరీ గురించి మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. వీళ్ళందరికీ చోరీ అలవాటేనని, అప్పడు గెలిచారు.. ఇప్పుడు వారి చోరీ నడవట్లేదు అంటూ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పుని అంగీకరించాలి.. ప్రజలను అవమానించేలా మాట్లాడడం మంచిది కాదు అని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సర్వశక్తివంతమైనది, సర్వోత్తమైనది అని అన్నారు. దానిని అవమానపరుస్తుంటే కాంగ్రెస్ మద్దతు తెలపడమా అని ప్రశ్నించారు. మూడుసార్లు మమతా బెనర్జీ గెలిచినప్పుడు తాము ఏమైనా అన్నామా అని నిలదీశారు. ప్రజా తీర్పును గౌరవించామని, కానీ వాళ్లు ఓడిపోతే ఈవీఎంలు, ఈసీఐ, దేశాన్ని నిందిస్తారు అని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




