దేశ కీర్తి పతాకను రెపరెపలాడించారు

– కామన్‌వెల్త్ క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు

న్యూదిల్లీ, ఆగస్టు 10 : దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. విÖ గెలుపు విÖకే కాదు దేశానికీ గర్వకారణమని వారిని ప్రశంసించారు. భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధానిని కలవగా వారితో సరదాగా మాట్లాడిన మోదీ అథ్లెట్లకు లడ్డూలు తినిపించారు. ఈ సందర్భంగా బాక్సర్ లవ్లీనా గ్లాస్గోలో చేసిన పనిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఆ రెస్టారెంటులో ఏం జరిగిందని మోదీ ప్రశ్నించగా ‘కామన్వెల్త్ గేమ్స్‌లో మంచి ప్రదర్శన చేశాం.. అది చివరి రోజు.. చాలా సంతోషంగా గడపాల్సిన సందర్భం.. అందుకోసం ఓ రెసార్టెంటుకు వెళ్లాం. అక్కడ హ్యాండ్ టవల్స్‌పై మన దేశ మ్యాప్ సరిగా లేదనిపించింది.. ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా.. మార్పులు చేస్తామని చెప్పార’ని ఆమె తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు కశ్మీర్ పూర్తి భూభాగాలను ఆ చిత్రపటంలో చూపకపోవడంతో సోషల్ విÖడియా వేదికగా లవ్లీనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెస్టారెంట్ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను జారీ చేసింది. సంబరాలు చేసుకుంటున్న సమయంలో విÖరు మ్యాప్ ప్రాముఖ్యతను గుర్తించడం నిజంగా అభినందనీయం అని మోదీ అన్నారు. ఆ వీడియో సాధారణమైంది కాదు.. దేశ ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటారన్నారు. ఇది కావాలనే చేసిందని.. పొరపాటు కాదని అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరో బాక్సర్ నరేంద్ర బేర్వాల్ గతంలో తనకు పాక్ బాక్సర్‌తో ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ‘పాకిస్థాన్ గురించి ఏం మాట్లాడినా నాకొక స్టోరీ గుర్తుకొస్తుంది సర్. అది 2015 మిలిటరీ గేమ్స్.. నా ఫస్ట్ ఫైట్ పాక్ బాక్సర్‌తో.. అప్ప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు ఒకటే చెప్పేవారు.. పాక్ బాక్సర్ చేతిలో మాత్రం ఓడిపోవద్దు.. ఆ మ్యాచ్‌లో వరుసగా రెండు రౌండ్లలో నేనే గెలిచా.. విÖరు 2014లో ప్రధానిగా వచ్చారు.. మా ఆర్మీ కోచ్ పేరు నరేందర్ రాణా.. దానిని ఉద్దేశిస్తూ పాక్ బాక్సర్ ’బ్రదర్ నీతో ఓ విషయం చెప్పాలను కుంటున్నా.. నీ పేరు నరేందర్. మీ కోచ్ పేరు నరేందర్. విÖ ప్రధాని నరేంద్ర. నాకు ఇక ఈ పేరు అంటేనే ఇష్టం ఉండదు అని అన్నాడు‘ అని బాక్సర్ చెప్పాడు. ఆ మాటలకు ప్రధాని మోదీ గట్టిగా నవ్వేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *