15న తెరుచుకోనున్న పాఠశాలలు

– స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌పై సర్వత్రా ఆందోళన
– ఫిట్‌నెస్ ‌లేక‌పోతే క‌ఠిన‌ చ‌ర్య‌లు
– జాయింట్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కమిషనర్‌ ‌చంద్రశేఖర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ఈ ‌నెల 15 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. 12 ‌నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి. ఈ క్ర‌మంలో ప్రైవేట్‌ ‌స్కూళ్ల బస్సుల భద్రతపై తల్లిదండ్రులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ ‌లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయంటు ఆందోళన చెందుతున్నారు. దీంతో విద్యాసంస్థల వాహనాలకు ఫిట్‌నెస్‌ ‌తప్పనిసరి అని జాయింట్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కమిషనర్‌ ‌చంద్రశేఖర్‌ ‌గౌడ్‌ ‌పేరొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిట్‌నెస్‌ ‌లేని, విద్యార్థులను లెక్కకుమించి ఎక్కించుకుని నడుపుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెహికల్స్‌కు పర్మిట్‌, ఇన్సూరెన్స్, ‌కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌ ‌తప్పనిసరి అని తెలిపారు. డ్రైవర్లు లైసెన్స్ ‌లేకుండా, ఓవర్‌ ‌లోడ్‌తో వాహనాలు నడిపితే వెంటనే సీజ్‌ ‌చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా 22,158 బస్సులు ఫిట్‌ ‌నెస్‌ ‌సర్టిఫికెట్‌ ‌పొందాయని, మిగిలిన 3,829 బస్సులు వెంటనే ఫిట్‌నెస్‌ ‌సర్టిఫికెట్‌ ‌పొందాలని చంద్రశేఖర్‌ ‌గౌడ్‌ ‌సూచించారు. ప్రైవేట్‌ ‌స్కూళ్లు, కళాశాల యాజమాన్యాలు ఫీజులపై ఉన్న శ్రద్ధ, బస్సుల ఫిట్‌నెస్‌పై కూడా ఉండాలని పేర్కొంటున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదానికి దారి తీసే అవకాశముందని అన్నారు. స్కూల్‌ ‌బస్సుకు పాఠశాల పేరు, ఫోన్‌ ‌నెంబర్‌, ‌చిరునామా, బస్సు ఎడమ వైపు పూర్తిగా కనిపించేలా ఉండాలి. వాహనాలు తప్పనిసరిగా పూర్తి కండిషన్‌లో ఉండాలని అధికారులు స్ప‌ష్టం చేశారు. బస్సు, వ్యాన్‌కు రెండు వైపులా మిర్రర్స్ ఉం‌డాలని, డ్రైవర్‌ ‌వయస్సు 60ఏళ్లకు మించరాదని తెలిపారు. తప్పనిసరిగా డ్రైవింగ్‌ ‌లైసెన్స్ ఉం‌డాలని, డ్రైవర్లు మూడు నెలలకోసారి షుగర్‌, ‌బీపీ, గుండె పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, ప్రతీ బస్సుకు ఒక అటెండర్‌ ఉం‌డాలని, బస్సులో అగ్నిప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉండాలని, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్‌ ‌కిట్‌, అగ్నిమాపక యంత్రం తప్పనిసరిగా ఉం‌డాలని స్ప‌ష్టం చేశారు. విద్యార్థులను తీసుకొచ్చే వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ ‌సదుపాయం ఏర్పాటు చేయాలి. పాఠశాల ఉన్న ప్రాంతంలో రహదారిపై స్కూల్‌ ‌జోన్‌ ‌సైన్‌ ‌బోర్డులు, రహదారిపై ప్రత్యేక రంగులు వేయించాలి. విద్యార్థులున్నారనే సంకేతాన్ని వాహనాల డ్రైవర్లు దూరం నుంచే గుర్తించేలా పిల్లల ఛాయాచిత్రాలతో బోర్డులు ఏర్పాటు చేయాలి. తరగతుల ప్రారంభం, ముగింపు సమయాల్లో రహదారిపై గేటు వద్ద రద్దీ సమస్య లేకుండా చూడాలి. పిల్లలు, వారి తల్లిదండ్రులు రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్‌ ‌బస్సులపై స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వ హిస్తాం అని తెలిపారు. అనుభవం ఉన్న డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా బస్సుల స్థితిపై ఫీడ్‌బ్యాక్‌ ‌తీసుకొని పాఠశాలల యాజమాన్యాలకు రిమార్కులు తెలియజేయాలి. ప్రమాదాలు జరుగకుండా పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రశేఖర్‌ ‌గౌడ్‌ ‌సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *