– ఫ్రాన్స్, స్లోవేకియాలలో మోదీ పర్యటన
న్యూదిల్లీ, జూన్ 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, స్లోవేకియాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 దేశాల సదస్సులో కూడా పాల్గొంటారు. ఇందుకోసం న్యూదిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రధాని ప్రత్యేక విమానంలో శనివారం బయల్దేరి వెళ్లారు. 1993 తర్వాత భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి. 14, 15 తేదీల్లో మోదీ స్లోవేకియాలో పర్యటిస్తారు. అక్కడి అధ్యక్షుడు పీటర్ పల్లెగ్రినితోపాటు ప్రధాని రాబర్ట్ ఫికోతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించి, పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అనంతరం ఫ్రాన్స్ చేరుకుని 16, 17 తేదీల్లో ఫ్రాన్స్‌లోని ఈవియన్‌లో ఉంటారు. అక్కడ జరిగే జీ-7 దేశాల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు విదేశీ నేతలు, ప్రతినిధులు హాజరవుతారు. వారితో దక్షిణాది ప్రపంచం గురించి చర్చిస్తామని మోదీ తెలిపారు. అనంతరం 18వ తేదీన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరిగే వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



