– నివేదిక ఎప్పుడు అందేదీ ఇప్పుడే చెప్పలేం
– అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రం
న్యూదిల్లీ, జూలై 27: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై రాజ్యసభలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. తుది నివేదికల విడుదలపై తలెత్తుతున్న ప్రశ్నలపై బదులిస్తూ ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి ఆలస్యం జరగలేదని స్పష్టంచేసింది. అదే చిన్న సంఘటన కాదని, అటువంటి భారీ ప్రమాదాల దర్యాప్తును పూర్తి చేయడానికి సమయం పడుతుందని తెలిపింది. భారీ విమాన ప్రమాదాల దర్యాప్తు అనేక అంశాలు.. వేర్వేరు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని.. అందువల్ల తుది నివేదిక కోసం ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేయడం సాధ్యం కాదని వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా నిర్ధరించడానికి ఎయిర్‌క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కృషి చేస్తోందని పౌర విమానయానశాఖ పేర్కొంది. నిర్దేశిత విధానాల ప్రకార దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ప్రమాదానికి దారితీసిన అన్ని కారణాలు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి తుది నిర్ణయానికి రాలేదని వెల్లడించింది. ప్రస్తుతం విమాన ’థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్’ను తనిఖీ చేసే పక్రియ జరుగుతోందని తెలిపింది. గతేడాది అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన వెంటనే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ విషాదానికి గురిచేసిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




