అయోధ్య విరాళాల చోరీ కేసు

– నివేదిక సమర్పించాలన్న సుప్రీం కోర్టు

న్యూదిల్లీ, జూలై 27 : అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)‌లో ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా స్టేటస్‌ ‌రిపోర్ట్ ‌సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్‌ ‌నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని కోరారు. అయితే.. ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. సిట్‌ ‌సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *