ఆం‌దోళనల నడుమే లోక్‌సభ వాయిదా

-పేపర్‌ ‌లీకుల బిల్లుపై రేపు చర్చ

న్యూదిల్లీ, జూలై 27: విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్‌ ‌లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చినా చర్చించడం సాధ్యం కాలేదు. ఓ వైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండగానే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‌సోమవారం ఉదయం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే.. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో మరోసారి స్పీకర్‌ ఓం ‌బిర్లా సభను మధ్యాహ్నం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను నేటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌ప్రకటించారు.పేపర్‌ ‌లీక్‌ ‌బిల్లు (సవరణ) చర్చకు రాకుండా విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు విమర్శించారు. ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చించి.. అనంతరం వోటింగ్‌ ‌నిర్వహించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *