ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

– అధికారులకు సీఎస్ రామకృష్ణా రావు ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో విద్యుత్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ వాహనాల వినియోగం అధికమైనందున పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని చార్జింగ్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల అమలుపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ మౌలిక వసతుల విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ సమీక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం అవుతున్నందున వినియోగదారుల అవసరాలను తీర్చడానికి విస్తృతమైన చార్జింగ్ నెట్‌వర్క్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను మ్యాపింగ్‌కు, పర్యవేక్షించడానికి కేంద్రీకృత, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ డ్యాష్‌బోర్డ్ ఈవీ కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక, పురోగతి పర్యవేక్షణ, పారదర్శకతకు కీలక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ అపార్టుమెంట్ భవనాల బేస్‌మెంట్‌లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసే విధానాన్ని రూపొందించే ప్రక్రియలో ఇంధన శాఖ ఉందని వెల్లడించారు. ఈ విధానం నగరవాసులకు సౌకర్యవంతమైన హోమ్ చార్జింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా ఈ వాహనాల వినియోగాన్ని పెంచడానికి దోహదపడుతుందన్నారు. సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ శశాంక, జీహెచఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీరెడ్‌కో ఎండీ అనిలా వవిల్లా, ఓఈఎం ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *