– విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి
– సీఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : ట్రాన్స్‌కో సీఎండీతో తమ సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. ప్రజా భవన్‌లో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎంతో శుక్రవారం సమావేశమయ్యారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ సాయిలు ప్రకటించారు.
ప్రజలను మెప్పించే పనులు చేయాలి: భట్టి విక్రమార్క
ఉద్యోగులు ప్రజలను మెప్పించే పనులు చేయాలి అని భట్టి విక్రమార్క సూచించారు. వేసవిలో విద్యుత్తు డిమాండ్ పీక్ స్థాయిలో ఉంటుంది.. సమ్మెపై బ్యాన్ ఉన్నదని తెలిసి ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని అన్నారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతుందని జేఏసీ నాయకులకు డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణంలో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్‌కో సీ¾ఎండీ చర్చలు జరుపుతారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. చర్చల్లో ట్రాన్స్‌కో సీ¾ఎండీ కృష్ణభాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ల కో చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్ చైర్మన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





