– తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
న్యూదిల్లీ, అక్టోబర్ 16 : న్యూదిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గౌరీ పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భవన్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ సెక్రటరీ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణవాసులు తరలివచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలతో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అందరూ ఒకచోట చేరి పాటలు పాడుతూ ఆనందాన్ని పంచుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని అన్నారు. దిల్లీలో ఉన్నప్పటికీ ఇలాంటి వేడుకలు తెలంగాణతో మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. పూలను సేకరించడం నుంచి బతుకమ్మలను అందంగా పేర్చడం వరకు మహిళలు ఎంతో శ్రద్ధ చూపుతారని, తమ ఆటపాటలతో పండుగకు జీవం పోస్తారని అన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు. పిల్లలకు మన పండుగలు, పాటలు, ఆచారాలను పరిచయం చేయడం ద్వారా సంస్కృతిని తరువాతి తరాలకు అందించాలని సూచించారు. తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





