హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ – 2026లో భాగంగా భారత్‌కు వివిధ దేశాలతో ఉన్న చారిత్రక సంబంధాలు, గతంలో భారత ప్రధానులు ఇతర దేశాలతో నెలకొల్పిన స్నేహపూర్వక సంబంధాలు, దౌత్యపరమైన అనుబంధాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు శుక్రవారం ప్రారంభించారు. 
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో భారత ప్రధానులు వివిధ దేశాలతో కొనసాగించిన సత్సంబంధాలు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాధించిన దౌత్యపరమైన పురోగతిని తెలియజేసే ఫొటోలను వారు ఆసక్తిగా పరిశీలించారు. ఆయా ఫోటోల్లోని చారిత్రక విశేషాలపై పరస్పరం చర్చించుకున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ పుస్తకాల స్టాల్‌ను సందర్శించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ “బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకాన్ని పరిశీలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





