– 12,13 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన
– 19న జిల్లా కేంద్రాలలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర
– యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు తిరుపతి, లింగారెడ్డి
హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 :ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న దశలవారీ పోరాటాలను విజయవంతం చేయం చేయాలని యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు నన్నెబోయిన తిరుపతి, టి లింగారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సం ఘాల పోరాట కమిటీ హనుమకొండ, వరంగల్ జిల్లాల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద్యమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నన్నెబోయిన తిరుపతి, టి లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు గడిచినప్పటికీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. సమస్యల పరిష్కారానికి యూఎస్పిసి ఆధ్వర్యంలో నాలుగు దశల పోరాటాన్ని నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేశామన్నారు. ఈనెల 12, 13వ తేదీలలో మండల కేంద్రాలలో తహసిల్దార్ కార్యాలయాల ముందు జరిగే నిరసన ప్రదర్శ నలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 19న జిల్లా కేంద్రాలలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర్న నిర్వహిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించలేకపోతే సెప్టెంబర్ లో అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం పిఆర్సిని జూలై 2023 నుండి వెంటనే అమలు చేయాలని, సిపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరారు. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే 25 జీవోను వెంటనే సవరించాలన్నారు. పాఠశాలల మూసివేత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేయాలన్నారు. సమావేశంలో యూఎస్పీసీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్, అటుకుల శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ వరంగల్ జిల్లా యుఎస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, గాదరి ఉప్పలయ్య, కట్కూరి శ్రీనివాస్, బైరి స్వామి, శ్రీనివాస్, బీమళ్ళ సారయ్య, డి.శ్రీరా మ్, ఎం.హర్షవర్ధన్ రెడ్డి, రవీందర్, ఆనందచారి, సూరయ్య, ఎ.మల్లయ్య, ఆర్.రామ్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




