11 ‌నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రజలకు పంగనామాలు

  • ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌ ‌రెడ్డి
  • పాలన తెలియక ఒత్తిడితో  తిట్ల పురాణం
  • కెసిఆర్‌ ‌కలుపు మొక్క కాదు.. కల్పవృక్షం
  • అబద్ధాలు ఆడడమే రేవంత్‌ ‌రెడ్డి డిఎన్‌ఎ
  • మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 20 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు గడుస్తున్నా పాలనాపరంగా విఫలమై రైతులకు ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పంగనామాలు పెట్టారని, కురుమూర్తి స్వామిపై ఒట్టు పెట్టి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పిన వ్యక్తి సీఎం రేవంత్‌ ‌రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఘాటుగా విమర్శించారు. బుధవారం మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో పూజల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్‌ ‌రావు మాట్లాడారు.. పంద్రాగస్టులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కురుమూర్తి వెంకటేశ్వరస్వామిపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఒట్టు పెట్టి మోసం చేశాడని, భూమి, ఆకాశం ఏకమైనా సరే మాట తప్పను అని రైతులకు మాటిచ్చాడని చెప్పి నిలబెట్టుకోలేదని అన్నారు.

మాట తప్పడం రేవంత్‌ ‌రెడ్డికి అలవాటేనని విమర్శించారు. కొడంగల్‌ ‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట ఇచ్చి తప్పాడని, ఎన్నికల ముందు బాండ్‌ ‌పేపర్‌ ‌మీద రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలో అమలు చేస్తామని చెప్పి మాట తప్పాడన్నారు. కనబడిన దేవుళ్లు, మసీదులు, చర్చిల మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పారన్నారు. పరిపాలన చేతకాక ఫ్రస్ట్రేషన్‌ ‌లో తిట్ల పురాణం మొదలుపెడతాడని, రేవంత్‌ ‌రెడ్డి మంగళవారం వరంగల్‌ ‌ప్రసంగంలో 50 సార్లు కేసీఆర్‌ ‌పేరు జపం చేశాడని, ప్రజలు కేసీఆర్‌ ‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఓటమి భయం మొదలై కేసీఆర్‌ ‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేడు మహబూబ్‌ ‌నగర్‌ ‌నాయకులతో కలిసి కురుమూర్తి స్వామిని దర్శించుకున్నామని, పాలకుడే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతామని రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపానికి ఆ స్వామిని దర్శించుకొని క్షమించమని ప్రజలపై ఆగ్రహం చూపొద్దు అని ప్రార్థించామని హరీష్‌ ‌రావు చెప్పారు. రైతులకు రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని, తర్వాత రూ.31 వేల కోట్లు అన్నారు. బడ్జెట్లో 26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. చేసింది ఎంత అంటే 17వేల కోట్లు! అని అన్నారు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని మాటిచ్చి 20 లక్షల మందికి మాత్రమే చేశారు. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు.

రైతులకు మేలు జరుగుతుందంటే నా ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ పూర్తి రుణమాఫీ రేవంత్‌ ‌రెడ్డి చేయడంలో విఫలమయ్యాడని విమర్శించారు. కెసిఆర్‌ ‌కు రేవంత్‌ ‌రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. రేవంత్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది కేసీఆర్‌ ‌పెట్టిన భిక్షే అని అన్నారు. కెసిఆర్‌ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశాను. రైతు డిక్లరేషన్‌ ‌వరంగల్‌ ‌లో చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ. తొమ్మిది రకాల హామీలతో రైతు డిక్లరేషన్‌ ‌ప్రవేశపెట్టింది. పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్తాడేమో అనుకున్నాము కానీ చెప్పలేదు. కెసిఆర్‌ ‌రూ.10వేలు రైతుబంధు ఇస్తున్నాడు మేము వొస్తే రూ.15వేలు ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. రైతు డిక్లరేషన్‌ ‌లో అన్ని పంటలకు రూ.500 బోనస్‌ ఇస్తానని చెప్పి మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు ఇస్తానని మోసం చేశారు. రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తానని వారినీ మోసం చేశారు. వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌లో ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ కూడా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలు చేయలేదు. మహబూబ్‌ ‌నగర్‌ ‌బిడ్డనని చెప్పుకుంటూ మహబూబ్‌ ‌నగర్‌ ‌పేరును చెడగొడుతున్నాడని హరీష్‌ ‌రావు విమర్శించారు.

సోనియాగాంధీని దేవత అని తెలంగాణ తల్లి అని రేవంత్‌ ‌రెడ్డి నిన్న వరంగల్‌ ‌సభలో అన్నాడు. ఇదే రేవంత్‌ ‌రెడ్డి సోనియా గాంధీని బలిదేవత దూషించాడని హరీష్‌ ‌రావు గుర్తుచేశారు. రేవంత్‌ ‌రెడ్డి అబద్ధాల నోటికి మొక్కాలి. అబద్ధాలు ఆడడమే రేవంత్‌ ‌రెడ్డి డిఎన్‌ఏ. ‌ప్రతిపక్షంపై పగ,, ప్రజలకు దగా ఇది రేవంత్‌ ‌రెడ్డి తీరు అని మండిపడ్డారు. కెసిఆర్‌ ‌ముఖ్యమంత్రిగా నిరంజన్‌ ‌రెడ్డి వ్యవసాయ మంత్రిగా విడుదల చేసిన చివరి రైతుబంధు కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చి తర్వాత ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ప్రజలు రైతుబంధు కోల్పోయారు. కేసీఆర్‌ ‌కిట్‌, ‌కేసీఆర్‌ ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌, ‌బతుకమ్మ చీరలు, దళిత సోదరులు దళిత బంధు, ముదిరాజ్‌ ‌బెస్తలు, చేప పిల్లలు కోల్పోయారని అన్నారు. రేవంత్‌ ‌రెడ్డి వొచ్చాక బ్రు టాక్స్ ‌వొచ్చిందని, ఫైనల్‌ ‌డిపార్ట్మెంట్లో బిల్లు రావాలంటే 8% నుంచి 15% టాక్స్ ‌వొచ్చిందన్నారు.. హైదరాబాద్‌లో ఎవరైనా బిల్డింగ్‌ ‌కట్టాలంటే స్క్వేర్‌ ‌ఫీట్‌ ‌కు రూ.100 టాక్స్ ‌వొచ్చింది.కరోనా వొచ్చినప్పుడు మంత్రుల జీతాలు ఎమ్మెల్యే జీతాలు బందు పెట్టి మరి రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు.

అప్పుడు వొచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని, ఎన్ని తిట్లు అయినా మేము భరిస్తాం కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా పోరాటం చేస్తామని తెలిపారు. రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి వాగులపై చెక్‌ ‌డ్యాములు నిర్మించి 24 గంటల కరెంటు ఇచ్చి రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. కెసిఆర్‌ ‌రైతు సీఎం అయితే రేవంత్‌ ‌రెడ్డి బూతు సీఎం అని ఫైర్‌ అయ్యారు. వృద్ధులకు 4000 పెన్షన్‌ ఇస్తానని మోసం చేశారని అలాగే, మహిళలకు 2500, రైతులకు 15వేల రైతుభరోసా, విద్యార్థులకు విద్య భరోసా కార్డ్ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. హైడ్రా మూసీ పేరుతో ఇళ్లను కూలగొట్టడం తప్ప రేవంత్‌ ‌రెడ్డికి ఇళ్ళు కట్టడం తెలియదన్నారు.

అందుకే ఆయన ఎనుముల రేవంత్‌ ‌రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్‌ ‌రెడ్డి అని సెటైర్ల వేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ ‌మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ‌పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్‌ ‌పార్టీ అని ఆరోపించారు. అయినా సరే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేయడానికి కేసీఆర్‌ ‌కృషి చేశారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం చివరి దశలో ఉందని, నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేసి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్నారు. కెసిఆర్‌ ‌గారు మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాను సస్యశ్యామలం చేశారు. కల్వకుర్తి పంప్‌ ‌హౌస్‌ ‌దగ్గర పడుకొని మరీ పనులు చేయించామన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు , బీమా కోయిల్‌ ‌సాగర్‌ ‌కింద దాదాపు 4 వేల కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని తెలిపారు.

2014లో రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వడ్లు మాత్రమే పండేదని,. కెసిఆర్‌ ‌దిగిపోయిన నాడు కోటి 59 లక్షల మెట్టి టన్నుల వడ్లు పండాయన్నారు. 30 లక్షల నుంచి కోటి 59 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే అది కేసిఆర్‌ ‌కృషి మాత్రమేనని చెప్పారు. 66 ఏండ్లు కాంగ్రెస్‌ ‌టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత పంట పండలేదు? అని ప్రశ్నించారు. కెసిఆర్‌ ‌ఘనతను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో 3000 రూపాయలు మహిళలకు ఇస్తామని అక్కడ కూడా తప్పుడు హామీ ఇచ్చి అబద్ధం చెపుతున్నారని, వరంగల్‌ ‌మీటింగ్‌ ‌లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా చెప్పలేదన్నారు. కెసిఆర్‌ ‌కలుపు మొక్క కాదు కల్పవృక్షం. రేవంత్‌ ‌రెడ్డి కలుపు మొక్క అని విమర్శించారు.

సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులను తొక్కుకుంటా అడ్డదారుల ముఖ్యమంత్రి అయ్యాడని, గెలిచిన తర్వాత పేదలను రైతులను తొక్కుకుంటూ అధికారం అనుభవిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ ‌రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ అని అన్నారు.కృష్ణయ్య అనే రైతు గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు కేంద్రానికి తెస్తే ఇప్పటివరకు కొనలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది మురికి కంటే రేవంత్‌ ‌రెడ్డి నోటి మురికి ఎక్కువ. ఈ పది నెలల కాలంలో తెలంగాణ 10 సంవత్సరాల వెనుకకు నెట్టేయబడింది. ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ ‌వస్తే అప్పుడు 100 సీట్లతో కేసీఆర్‌ ‌ను గెలిపిస్తారన్నారు.మళ్లీ కేసీఆర్‌ ‌రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని హరీష్‌ ‌రావు చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌నిరంజన్‌ ‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ ‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నవీన్‌, ‌మాజీ ఎంపీ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌, ‌మాజీ రాష్ట్ర కార్పొరేషన్‌ ‌చెర్మన్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page