బహుభాష సాహితీ మూర్తి

(భారత పూర్వ  ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ పి. వి. నర్సింహారావు గారి జయంతి జూన్ 28 సందర్బంగా)

మాటల మనిషి కాడతను
చేతల మనిషి
ఆర్థిక సంస్కరణలతో..
చిరు దివ్వెలు వెలిగించి
చివాట్లు తిన్నా..
ఆ సంస్కరణలే, ఈనాడు
ఈ దేశ ప్రగతికి
రథ చక్రాలయి పరుగులు పెడుతుంటే
తొలి తెలుగు ప్రధాన మంత్రిగా
ఓ తెలంగాణ బిడ్డ ఖ్యాతి
జగమంతా మారుమ్రోగుతుంటే
తెలంగాణ తల్లి.. తన ఒడిలోకి
ఆ పుత్రుని అక్కున చేర్చుకొని మురిసిపోయింది
ఆనంద భాస్పాలతో ఉబ్బి తబ్బిబయింది..
వినయ విధేయతలే విషయ పరిజ్ఞానంగా
విశ్వనీయతే ఆలంబనగా..
నిరాడంబరమే పరమవధిగా
దేశ సేవలో నిరంతరం
కొవ్వొత్తిలా కరిగిపోతూ..
అభివృద్ధి వెలుగులు
పంచిన సహనశీలి
విశ్వనాథ వేయి పడగలు
హిందీలోకి అనువాదించి
తెలుగు భాష కమ్మదనంను
లోకాన్నికి రుచి చూపిన
బహుభాష సాహితీ మూర్తి
మంచితనపు ముత్యాల కిరీటంతో
అందరి గుండెల్లో గూడు కట్టుకున్న అపార చాణిక్యుడు
మనం మరిచిపోయిన
మరువదు ఈ మట్టినేల
నిత్యం చిగురులు తొడిగే
పచ్చని మొలకలు
పున్నమి పండు వెన్నెల్లో
నూరేళ్ళ ఐదు వసంతోత్సవాల
జన్మదిన వేడుకల వేళ
వారి గుండె చప్పులను
ఆస్వాదిస్తూ.. ఆహ్లాద పరుస్తూ
అతని మధుర స్మృతులను
గురుతు తెచ్చుకొని
పి వి కలలు కన్న నవ భారత నిర్మాణానికి కంకణం
కట్టుకొని
కుల మత పేద ధనిక తారతమ్యలను పక్కనెట్టి
కలిసి ముందుకు సాగుదాం
భిన్నత్వంలో ఏకత్వంను
ప్రపంచానికి చాటుదాం.
*** జైహింద్ ****
-కొండ రవీందర్
9059237771

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *