– కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం..
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. నీట్ యూజీ-2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి అర్హత పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ ప్రక్రియ ఈనెల 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే తమ దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇతర వివరాల కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌ను పరిశీలించాలని సూచించింది. అర్హులైన అభ్యర్థులు https://tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



