– ఏడాదిన్నరపాటు అమలు కానున్న ఆంక్షలు
– ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం
– ట్రాఫిక్ సూచనలను పాటించాలన్న సీపీ సజ్జనార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రక్రియ ఏడాదిన్నరపాటు కేబీఆర్ పార్క్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాల్సి ఉంటుంది. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకే వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నట్టు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెం.45 మీదుగా ఐటీ కారిడార్ కు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం, ఫిల్మ్ నగర్ మీదుగా రోడ్ నెం.45 చేరుకుని అక్కడి నుంచి ఐటీ కారిడార్ కు చేరుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. హెచ్- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ వీటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ పార్కు చుట్టూ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు పార్కు చుట్టూ వన్ వే చేశామన్నారు. ఈ నిర్ణయంతో చాలామంది ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ‘కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేకి సహకారం అందిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. అగ్రసేన్ చౌరస్తా రోడ్ నం 45, చెక్ పోస్ట్, వెంకటగిరి దగ్గర కాస్త ఇబ్బంది కలిగిందని, డ్రోన్స్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇంకా కొన్నిచోట్ల సూచికలు పెట్టాల్సి ఉందన్నారు. సాంకేతికతను ఉపయోగించి ఇంకా ఎటువంటి మార్పులు చేయాలో చూస్తామని సజ్జనార్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





