– ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 24 : డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే నిర్వహిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ‘నశా ముక్త భారత’ కింద ఈ ఏడాది కూడా ర్యాలీ చేపడుతున్నామన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఒలింపిక్ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. ఈ రన్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఒలింపిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల్ని ఎండలో ఉంచాలంటే తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారు.. కానీ ‘డి’ విటమిన్ కోసం ఒక ట్యాబ్‌లెట్ వేస్తున్నారని అన్నారు. యోగా చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, యోగాతో ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించారు. తాము చిన్నపుడు ఒలింపిక్స్ క్రీడలను చూసేదని, ఇండియాకు ఎన్ని కప్ప్పులు వచ్చాయో అని తెలుసుకునే వాళ్లమని అన్నారు. ఒలింపిక్స్‌లో ఎప్పుడూ చైనా మొదట వచ్చేదని, మనం మాత్రం కింది స్థానంలో ఉండే వాళ్లమని వెల్లడించారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు క్రీడలు అలవాటు చేయాలని ఎంపీ సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్లు మన దేశానికి కావాల్సింది భగవద్గీత పుస్తకాలు కాదని, క్రీడా మైదానాలు కావాలని చెప్పారు. ఉన్నతస్థానంలో ఉన్న మన క్రీడాకారులను స్పూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. సిద్దిపేటకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉండటం అదృష్టమంటూ విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ రఘునందన్ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





