– జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలి
– ఓబీసీల సమస్యలపై రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయాలి
– ఓబీసీల జనాభాపై కచ్చితమైన గణాంకాలుండాలి
– శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఓబీసీలకు సంబంధించిన ఈ అంశంపై సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఈ ముఖ్యమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్న నేపథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతు న్నామ న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన సభ్యులు కూడా బీసీల సమస్యలపై శాసనసభ ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణ యానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశవ్యా ప్తంగా ఓబీసీల జనాభా గణాంకాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుల ఆధారిత జన గణన ఎందుకు అవసరమో అందరూ అర్థం చేసు కోవాలి. బీసీల సామాజిక న్యాయం, విద్యా అవ కాశాలు, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కచ్చితమైన గణాంకాలు అవసరం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక,ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీల వాస్తవ పరిస్థితిని గుర్తించే ప్రయత్నం చేసింది. ఆ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీలకు స్పష్టమైన ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఓపెన్ కాలమ్ విధానం పెట్టడం వల్ల కచ్చితమైన ఓబీసీ గణాంకాలు సేకరించడం కష్టమైంది. కులాల పేర్లు, వివరాలు స్పష్టంగా నమోదు చేయకపోవడం వల్ల ఓబీసీల వాస్తవ జనాభా, వారి అవసరాలను అంచనా వేయడంలో సమస్యలు ఏర్పడ్డాయి. తెలంగాణలో ముందుగానే కులాల జాబితాలను రూపొందించి సర్వే నిర్వహించడం వల్ల కచ్చితమైన గణాంకాలు సేకరించడం సాధ్యమైంది. కేకేంద్ర జనగ ణనలో ఓబీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ప్రత్యేక గుర్తింపు కల్పించాలి. జనగణన షెడ్యూల్లో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ను ఏర్పాటు. చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక రికార్డుల్లో ఉన్న కులాల వివరాలను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయాలి. కచ్చితమైన కుల గణాంకాల ఆధారంగా సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలి. దేశవ్యా ప్తంగా బీసీలకు న్యాయం జరిగేలా కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శ కంగా నిర్వహించాలి. ఈ అంశాలన్నింటిపై శాసనసభ ఏకగ్రీ వంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కచ్చితమైన బీసీ గణాంకాలు ఉంటేనే సామాజిక న్యాయం కోసం సరైన విధానాలను రూపొందించడం సాధ్యమవుతుంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవా లిన అవసరం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





