వర్కింగ్ జర్నలిస్టులకు ఏఐపై 16న వర్క్‌షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : వర్కింగ్ జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అకాడమి ఈనెల 16న ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై వర్క్‌షాప్‌ను నిర్వహించ తలపెట్టింది. ఈ వర్క్‌షాప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గంట వరకు నాంపల్లి ఛాపెల్ రోడ్డులోని మీడియా అకాడమి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రవేశిక, వినియోగించే టూల్స్, పద్ధతులు, దీని ద్వారా రూపొందించే అంశాలలో బాధ్యతాయుత, నైతిక ప్రమాణాల లాంటి అంశాలు ఇందులో ఉంటాయి. వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఆసక్తి గల జర్నలిస్టులు తాము పనిచేస్తున్న మీడియా సంస్థ, ప్రదేశం, మొబైల్ నెంబర్ వివరాలు తెలుపుతూ అకాడమి వాట్సఅప్ నెంబర్ 7093600977కు తమ పేర్లను 12లోగా నమోదు చేసుకోవాలి. ముందుగా నమోదు చేసుకున్న అర్హత గల 50మంది వర్కింగ్ జర్నలిస్టులకు వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని అకాడమి తెలిపింది.

——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *