విక్రమ్-1 విజయం శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హ‌ర్షం 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : శ్రీహరికోట వేదికగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో చరిత్రాత్మక విజయాన్ని సాధించ‌డం ప‌ట్ల బీజేపీ రా ష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు ఓ ప్రకటనలో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇస్రో, విక్రమ్-1 బృందానికి, మన దేశ శాస్త్రవేత్తలకు పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన, వ్యక్తిగతంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తినా అధైర్యపడకుండా 35 నిమిషాల్లోనే ఆ లోపాన్ని సరిచేసి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపడం శాస్త్రవేత్తల అమోఘమైన ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనమన్నారు. యావత్ భారతదేశం గర్వించేలా మన శాస్త్రవేత్తలు ఈ రోజు సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. రోదసి రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఈ విక్రమ్-1ను రూపొందించిన ‘స్కైరూట్‌’ ప్రైవేటు సంస్థ హైదరాబాద్‌కు సమీపంలోనే ఉండటం మన తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకూ ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేడిన్ ఇండియా’ నినాదాల లక్ష్యాలను పూర్తి చేయడంలో నేడు గగనతలంలోకి దూసుకెళ్లిన ఈ స్కైరూట్ సంస్థ ప్రయోగ సత్ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ ఈ ప్రయోగాన్ని వీక్షించడమే కాక శ్రీహరికోటలో ఉన్న శాస్త్రవేత్తలను ఫోన్ ద్వారా అభినందింరని తెలిపారు. ప్రధాని చూపిన ఈ చొరవ శాస్త్రవేత్తలలో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతుందని, మన దేశం మరిన్ని అద్భుత ప్రయోగాలకు నిలయంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. అంతరిక్ష రంగానికి, సరికొత్త పరిశోధనలకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న అపారమైన ప్రోత్సాహం, నిరంతర మద్దతు వల్లే నేడు ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతున్నాయన్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశ స్వయంసమృద్ధికి, నవ భారత ప్రగతికి ఈ ప్రయోగం మరింత ఊతాన్ని ఇస్తుందన్నారు. ‘స్కైరూట’ భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రామచందర్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *