“ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవలి సామాజిక ప్రవర్తనలో, ప్రచార మాధ్యమాల ప్రకారం, నిరసన తెలుపుతున్న పౌరులకు వ్యతిరేకంగా పోలీసులు చూపిన క్రూరత్వ ఆరోపణలను తేలిగ్గా తీసిపారవేశారో, ఆ వ్యక్తి చేతుల నుంచి మా డిగ్రీలు తీసుకోవడం, ఇంతకాలం నల్సార్ విశ్వవిద్యాలయంలో మేము నేర్చుకున్న విలువలకు సరిపడనిదని మేం అనుకుంటున్నాం” అని విద్యార్థులు కుండ బద్దలు కొట్టారు. వారు ఎంత నర్మగర్భంగా రాసినా, ఆ మనిషి చేతులు మాకు డిగ్రీ ఇవ్వడానికి తగినవని మేం అనుకోవడం లేదు అనే మాట స్పష్టంగానే ఉంది..”
హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులు చేసిన ప్రకటనకు, ప్రదర్శించిన నిష్కర్షకు అభినందనలు, కృతజ్ఞతలు,శుభాకాంక్షలు. ఈ పరిణామం పూర్తిగా తెలంగాణకు సంబంధించినది కాకపోవచ్చు, నల్సార్ లో విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉంటారు. కాని ఎక్కడి నుంచి వచ్చినా తెలంగాణ నేల మీద చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు ప్రస్తుత సందర్భంలో అత్యవసరమైన ధిక్కారాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెప్పవలసి ఉంది. ఇవాళ మన సమాజంలో అతి ధూర్త వినయాలు,మొహమాటాలు, మర్యాదలు, నంగిమాటలు, స్వప్రయోజనాల కోసం విలువల తాకట్టు, భజన, రాగ్ దర్బారీలో భాగస్వామ్యం, ఎంగిలి మెతుకుల కోసం వెంపరలాట వంటి లక్షణాలే సమర్థతకూ,నైపుణ్యానికీ చిహ్నాలుగా మారుతున్న సందర్భంలో, సామాజిక విలువల చట్రమే తలకిందులుగా అమలవుతున్నవేళ, ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా చెప్పడానికి సాహసించినందుకు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు జేజేలు.
బహుశా వారందరూ ఇంకా ఇరవై, ఇరవై ఐదేళ్ల లోపు చిన్నారి పిల్లలు. న్యాయశాస్త్రం చదువుకున్నవాళ్లు. న్యాయశాస్త్రం చదువుకుని తల పండిపోయి న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా అన్యాయాన్నే తలకెత్తుకుంటున్న అనేక మందిలా కాక, యువతరపు ఉడుకు నెత్తురుతో, తమ న్యాయ శాస్త్ర పరిజ్ఞానం న్యాయ భావనను నిలబెట్టడానికి ఉపయోగించాలని అనుకున్నారు. చాలామంది పెద్దలు, చదువుకున్నవాళ్లు, బుద్ధిమంతులు చెప్పలేని మాటలు చెప్పారు, చేయలేని పని చేశారు. ‘రాజుగారికి బట్టల్లేవు’ అనే వాస్తవాన్ని, చుట్టూ చూస్తున్న నిండు పేరోలగం, వందిమాగధ, కవి గాయక స్తోత్ర పాఠకులు అనలేకపోయిన మాటను, ఒక అమాయకపు చిన్నారి పిల్లవాడు అన్న జానపద కథ మనందరికీ తెలుసు. సరిగ్గా ఆ కథలోని ముక్కుపచ్చలారని చిన్నారి లాగనే, దేవతావస్త్రాలతో తిరుగుతున్న భారత ప్రధాన న్యాయమూర్తి గురించి నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నిజం బైట పెట్టారు.
ప్రతి విశ్వవిద్యాలయం లోనూ విద్యా సంవత్సరం చివర తమ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసే ఉత్సవం జరుగుతుంది. కాన్వొకేషన్ అని పిలిచే ఈ ఉత్సవం విద్యార్థుల జీవితంలో చాలా కీలకమైన, సంతోషకరమైన సందర్భం. పట్టాలు ప్రదానం చేయడానికీ, ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కాన్వొకేషన్ అడ్రస్ అనే కీలకోపన్యాసం చేయడానికీ ఒక ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలుస్తారు. నల్సార్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ కూడా అయిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని నల్సార్ కాన్వొకేషన్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీ.
ఈ సంవత్సరం కాన్వొకేషన్ మరి కొద్ది రోజుల్లో జరుగుతుందనగా,యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నూ, రిజిస్ట్రార్ నూ, అధ్యాపకులనూ సంబోధిస్తూ 450 మంది విద్యార్థులు రాసిన ఒక ఇమెయిల్ లేఖ జూలై 23న బైటపడింది. ఆ లేఖను మొదట డెబ్బై మంది విద్యార్థులు ప్రారంభించారనీ, కాని కొన్ని గంటల్లోనే మరొక 380 మంది విద్యార్థులు దాని మీద సంతకాలు పెట్టారనీ తెలుస్తున్నది. ఆ లేఖలో విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను విశ్వవిద్యాలయ కాన్వొకేషన్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
“నిజానికి దేశంలో న్యాయవ్యవస్థ ప్రజలకు అందరాని దూరంలో, ఖరీదులో ఉందనీ, అందువల్ల ప్రజల నుంచి ఏ రూపంలో ఫిర్యాదు వచ్చినా స్వీకరించాలనీ, పోస్ట్ కార్డ్,టెలిగ్రామ్, మామూలు ఉత్తరం, చివరికి పత్రికా వార్త వంటి వాటిని కూడా స్వీకరించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణ జరపాలనీ ఇదే సుప్రీం కోర్టు 1970ల చివరలో, 1980లలో ఒక కొత్త, అవసరమైన,ప్రజోపయోగకరమైన, ఈ దేశానికి అవసరమైన సంప్రదాయాన్ని నెలకొల్పింది. ఇటీవలి కాలంలో ఆ సంప్రదాయానికి స్వయంగా న్యాయమూర్తులే తూట్లు పొడవడం జరుగుతున్నది. ప్రధాన న్యాయమూర్తితో సహా ఎందరో న్యాయమూర్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను చిన్నచూపు చూస్తూ వ్యాఖ్యలు చేశారు..”
“న్యాయశాస్త్ర విద్యార్థులుగా, మా ఆసక్తి పరిమితమైనది. పట్టాలు పుచ్చుకోబోతున్న తరగతి విద్యార్థులుగా మా ఆందోళన ప్రత్యేకమైనది. మా దృష్టిలో కాన్వొకేషన్ ప్రత్యేకమైనది. రాజ్యాంగ హక్కుల పట్ల నిబద్ధత, అందరికీ అందుబాటులో న్యాయం, సమస్యలతో సహేతుకంగా వ్యవహరించడం అనే విలువలతో సహా మన విశ్వవిద్యాలయపు సొంత విలువలు కూడా స్పష్టంగా ప్రతిఫలించే,విశ్వవిద్యాలయ ఎంపికలు వ్యక్తమయ్యే మహత్తర సమయం ఇది. ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవలి సామాజిక ప్రవర్తనలో, ప్రచార మాధ్యమాల ప్రకారం, నిరసన తెలుపుతున్న పౌరులకు వ్యతిరేకంగా పోలీసులు చూపిన క్రూరత్వ ఆరోపణలను తేలిగ్గా తీసిపారవేశారో, ఆ వ్యక్తి చేతుల నుంచి మా డిగ్రీలు తీసుకోవడం, ఇంతకాలం నల్సార్ విశ్వవిద్యాలయంలో మేము నేర్చుకున్న విలువలకు సరిపడనిదని మేం అనుకుంటున్నాం” అని విద్యార్థులు కుండ బద్దలు కొట్టారు. వారు ఎంత నర్మగర్భంగా రాసినా, ఆ మనిషి చేతులు మాకు డిగ్రీ ఇవ్వడానికి తగినవని మేం అనుకోవడం లేదు అనే మాట స్పష్టంగానే ఉంది.
ఈ ఉత్తరం జూలై 23న బైటపడింది గాని, పోలీసు దౌర్జన్యపు వీడియోలు చూడడానికి తనకు సమయం లేదని ప్రధాన న్యాయమూర్తి జూలై 21న సుప్రీం కోర్టులో చేసిన వ్యాఖ్యల తర్వాత రాసినదై ఉంటుంది. జూలై 20న దిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు భవనానికి శాంతియుత ప్రదర్శన జరపాలని కాక్రోచ్ జనతా పార్టీ ‘ఛలో సంసద్’ పిలుపు ఇచ్చింది. లక్షలాది తరలి వచ్చిన విద్యార్థి యువజన ప్రదర్శనకారుల మీద దిల్లీ పోలీసులు లాఠీ చార్జి చేశారు. వాటర్ కానన్ లతో దాడి చేశారు. పెల్లెట్ గన్ లతో కాల్పులు జరిపారు. దారుణమైన హింసాకాండ అమలు జరిపారు. వందలాది మంది విద్యార్థులను గాయపరిచారు. నెత్తురు పారించారు. నిరసన ప్రదర్శనలతో వ్యవహరించడానికి ఉన్న చట్టపరమైన నిబంధనలన్నిటినీ ఉల్లంఘించారు. గోదీ మీడియాగా పేరు పొందిన ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలు ఈ దమనకాండను చూపనప్పటికీ, తగ్గించి చూపినప్పటికీ, సామాజిక మాధ్యమాలలో ఆ పోలీసుల దౌర్జన్యం, చట్టవ్యతిరేక, అమానుష ప్రవర్తన అంతా సంపూర్ణంగా కనబడుతున్నది. ఈ దమనకాండ మీద సుప్రీంకోర్టు వెంటనే విచారణ జరపాలనీ, విద్యార్థుల మీద హింసకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలనీ సుప్రీం కోర్టు ముందరికి అభ్యర్థనలు వస్తే,అవి వినడానికీ, వీడియోలు చూడడానికీ తమకు సమయం లేదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు చూపెట్టి కోర్టు సమయం వృథా చేయవద్దనీ, న్యాయవాదులు తమ సమయం వృథా చేసుకోవద్దనీ జస్టిస్ సూర్యకాంత్ ఉచిత సలహా ఇచ్చారు. ఆ వార్తలు చదివితే ఏమాత్రం హృదయం ఉన్నవారైనా ఆ నిర్దాక్షిణ్య స్పందనకు కోపం తెచ్చుకోకతప్పదు. నల్సార్ విద్యార్థులు తమ లేఖలో ప్రకటించినది ఆ న్యాయమైన ఆగ్రహాన్ని మాత్రమే.
తాను అలా అనలేదని, ప్రచార సాధనాలు తప్పుగా రాశాయని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. జంతర్ మంతర్ పోలీసు దుర్మార్గాల మీద విచారణ కూడా ప్రారంభించారు. అయినప్పటికీ,అనాలోచితంగానో, ఉద్దేశపూర్వకంగానో ఆయన అంతకు ముందు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా విద్యార్థి యువజనుల జ్ఞాపకంలో నిలిచిపోయాయి. తాను ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు పద్ధతి ప్రకారం పిటిషన్ రాలేదని, ఒక న్యాయవాది మౌఖికంగా ప్రస్తావించారని సాంకేతిక కారణం చెప్పినప్పటికీ, విద్యార్థి ప్రదర్శకుల పట్ల, పోలీసుల దుర్మార్గం పట్ల ఆయన మనసులోని మాట ఏమిటో దేశానికి తేటతెల్లమయింది.
నిజానికి దేశంలో న్యాయవ్యవస్థ ప్రజలకు అందరాని దూరంలో,ఖరీదులో ఉందనీ, అందువల్ల ప్రజల నుంచి ఏ రూపంలో ఫిర్యాదు వచ్చినా స్వీకరించాలనీ, పోస్ట్ కార్డ్, టెలిగ్రామ్, మామూలు ఉత్తరం,చివరికి పత్రికా వార్త వంటి వాటిని కూడా స్వీకరించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణ జరపాలనీ ఇదే సుప్రీం కోర్టు 1970ల చివరలో,1980లలో ఒక కొత్త, అవసరమైన, ప్రజోపయోగకరమైన, ఈ దేశానికి అవసరమైన సంప్రదాయాన్ని నెలకొల్పింది. ఇటీవలి కాలంలో ఆ సంప్రదాయానికి స్వయంగా న్యాయమూర్తులే తూట్లు పొడవడం జరుగుతున్నది. ప్రధాన న్యాయమూర్తితో సహా ఎందరో న్యాయమూర్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను చిన్నచూపు చూస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టుకు కూతవేటు దూరంలో రోడ్ల మీద విద్యార్థులను పరుగెత్తిస్తూ, నెత్తురు కారేట్టు కొడుతున్నప్పుడు,పెల్లెట్ గన్ లతో చట్టవ్యతిరేక కాల్పులు జరుపుతున్నప్పుడు, ఆ చర్యలు ఎంత అమానుషంగా, ఎంత చట్టవ్యతిరేకంగా, ఎంత అప్రజాస్వామికంగా జరిగాయో చూడడానికైనా వీడియోలు చూడడం న్యాయమూర్తుల బాధ్యత. పోలీసులు అంతా సక్రమంగానే ప్రవర్తించారు అని నిర్ధారించడానికైనా ఆ వీడియోలు చూడాలి. కాని బాధ్యతారహితంగా తనకు అవి చూసే సమయం లేదని అనడం,ఎటువంటి పరిస్థితిలో అన్నప్పటికీ క్షమార్హం కాదు.
“నిజానికి జస్టిస్ సూర్యకాంత్ గత చరిత్రలోని అభ్యంతరకర విషయాలను, ప్రధాన న్యాయమూర్తిగా చట్టాన్ని కూడా పక్కన పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన తీరును, బెంగాల్ వోటర్ల తొలగింపులో,స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విచారణలో ఆయన తీసుకున్న అన్యాయమైన వైఖరిని పక్కన పెట్టినా, మే రెండో వారంలో తన ముందుకు వచ్చిన ఒక కేసులో అనవసరంగా ఈ దేశ యువతరం గురించి పరాన్నభుక్కులనీ, బొద్దింకలనీ, మీడియాగా,ఆందోళనకారులుగా మారుతారనీ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులలో ఆయన పట్ల వ్యతిరేక పెరగడానికి కారణమయ్యాయి. నల్సార్ విద్యార్థుల ప్రతిఘటన ఆ దేశవ్యాప్త ఆగ్రహ ప్రకటనలో భాగమే..”
“మేము ఈ సమస్యను ఇప్పుడే, కాన్వొకేషన్ కన్నా చాలా ముందే,ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించాలని మీరు నిర్ణయం తీసుకోకముందే మీ దృష్టికి తెస్తున్నాం. మీరు నిర్ణయం తీసుకునే సమయానికి మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము” అని రాశారంటే విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారుల పట్ల ఎంత మర్యాదగా, గౌరవంతో ఉన్నారో కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఆయనను ఆహ్వానించాలనే ప్రతిపాదన ఏదైనా ఉంటే దాన్ని లాంఛనప్రాయమైన ఆహ్వానం పంపకముందే తీవ్రంగా పునరాలోచించాలని కూడా విద్యార్థులు సూచించారంటే విద్యార్థుల సమన్వయ ధోరణి కనబడుతుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న వ్యక్తి విషయంలో ఇలా జరగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. మరొక ఎనిమిది నెలల్లో పదవీ విరమణ చేయబోతుండగా ఆయన ఇటువంటి అవమానాలను, తిరస్కరణలను మూటగట్టుకోవడం విచారకరమే. విద్యార్థులు ఇలా ప్రవర్తించడం వ్యక్తిగతంగా జస్టిస్ సూర్యకాంత్ కు అవమానమనో, అగౌరవమనో, భారత ప్రధాన న్యాయమూర్తి అనే పదవి ప్రతిష్ఠకు భంగకరమనో ఎవరైనా అనుకోవచ్చు. కాని ఈ పరిణామాలు ఇలా సంభవించడానికి పూర్తి బాధ్యత ఆయన ప్రవర్తనలోనే ఉంది. లేదా న్యాయవ్యవస్థ స్వతంత్రతను చెరిపివేస్తూ అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడంలోనే ఉంది.
నిజానికి జస్టిస్ సూర్యకాంత్ గత చరిత్రలోని అభ్యంతరకర విషయాలను, ప్రధాన న్యాయమూర్తిగా చట్టాన్ని కూడా పక్కన పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన తీరును, బెంగాల్ వోటర్ల తొలగింపులో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విచారణలో ఆయన తీసుకున్న అన్యాయమైన వైఖరిని పక్కన పెట్టినా, మే రెండో వారంలో తన ముందుకు వచ్చిన ఒక కేసులో అనవసరంగా ఈ దేశ యువతరం గురించి పరాన్నభుక్కులనీ, బొద్దింకలనీ, మీడియాగా,ఆందోళనకారులుగా మారుతారనీ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజనులలో ఆయన పట్ల వ్యతిరేక పెరగడానికి కారణమయ్యాయి. నల్సార్ విద్యార్థుల ప్రతిఘటన ఆ దేశవ్యాప్త ఆగ్రహ ప్రకటనలో భాగమే.
నల్సార్ విద్యార్థుల వ్యతిరేకత మొదటిదేమీ కాదు. అహ్మదాబాద్ లో జూలై 26న జరిగిన ఓ పి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ – జిందాల్ గ్లోబల్ లా స్కూల్ కాన్వొకేషన్ కు కూడా ఆయన ముఖ్య అతిథిగా వెళ్లవలసి ఉండింది. చివరి నిమిషంలో ఆయన ప్రయాణం రద్దయి,ఆ స్థానంలో సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది, రాజ్య సభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి వెళ్లారు. రెండు రోజుల తర్వాత న్యూదిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగిన ఎచ్ ఆర్ ఖన్నా స్మారకోపన్యాస కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసి ఉండగా ఆ కార్యక్రమాన్ని ఏ కారణమూ చెప్పకుండానే వాయిదా వేశారు. ఆగస్ట్ 2న ముంబాయి లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) కాన్వొకేషన్ లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసి ఉండగా, అనివార్య పరిస్థితుల్లో ఆ కాన్వొకేషన్ ను రద్దు చేస్తున్నామని టిస్ ప్రకటించింది. అంటే రెండు వారాలలో ప్రధాన న్యాయమూర్తి నాలుగు తిరస్కారాలను ఎదుర్కోవలసి వచ్చిందన్నమాట.
అన్ని రాజ్యాంగ వ్యవస్థల తటస్థతను, ప్రతిష్ఠను, గౌరవాన్ని కొల్లగొట్టి,వాటిని ధ్వంసం చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయదలచిన సంఘ్ పరివార్ పాలనలో అత్యంత సహజమైన పరిణామాల్లో ఒకటి నల్సార్ విద్యార్థుల తిరస్కారం. అది ఎవరి పట్లనో అగౌరవం కాదు. విలువలు దిగజారుతున్న వ్యవస్థలో తప్పనిసరిగా పాటించవలసిన నిష్కర్ష.





