Tag accountability

మాటలు కాదు, చేతలు కావాలి?

 “ఒక రాష్ట్రానికి సర్వాధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అయి ఉండి, చట్ట ప్రకారం – రాజ్యాంగ ప్రకారం తన విధులు తాను నిర్వహించుకుంటూ పోవాల్సింది పోయి.. సాయుధ విప్లవ భాషను పోలిన పదజాలం, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడడం ప్రజాస్వామికం అవుతుందా? రాజ్యాంగబద్ధ విధానం అవుతుందా? రాబోయే ఎన్నికల గెలుపు కోసం, పాలకులు ఈ విధంగా దిగజారి…

ఈ విఘ్నాలు తొలగించేదెవరు?!

“ఈ సంవత్సరం జిఎచ్ఎంసి పరిధిలో లక్షా యాబై వేలు,సైబరాబాద్ పరిధిలో లక్షా ఇరవై వేలు, మల్కాజిగిరి పరిధిలో ఎనబై వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు ప్రకటించారు గాని, వాస్తవంగా జరిగిన నిమజ్జనాల సంఖ్యలో ఇది సగమో ముప్పాతికో మాత్రమే. అలాగే, ఈ 4,527 టన్నుల వ్యర్థాల లెక్క కూడా వాస్తవంగా జరిగినదానిలో కొంతభాగం మాత్రమే కావచ్చు. జిఎచ్ఎంసి పరిధిలో సగటున రోజుకు 9,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయని అంచనా కాగా, అంతకన్న ఎక్కువ వచ్చినదాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా జిఎచ్ఎంసి…

అగౌరవం కాదు, అవసరమైన నిష్కర్ష!

“ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవలి సామాజిక ప్రవర్తనలో, ప్రచార మాధ్యమాల ప్రకారం, నిరసన తెలుపుతున్న పౌరులకు వ్యతిరేకంగా పోలీసులు చూపిన క్రూరత్వ ఆరోపణలను తేలిగ్గా తీసిపారవేశారో, ఆ వ్యక్తి చేతుల నుంచి మా డిగ్రీలు తీసుకోవడం, ఇంతకాలం నల్సార్ విశ్వవిద్యాలయంలో మేము నేర్చుకున్న విలువలకు సరిపడనిదని మేం అనుకుంటున్నాం” అని విద్యార్థులు కుండ బద్దలు కొట్టారు.…

ఎవరి త్యాగం? ఎవరి భోగం?

  “ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించింది. మొత్తం వరుసలో ఐదో పనో, ఆరో పనో అయిన భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం ఇంత హడావిడిగా, ఇంకా మొదటి పని కూడా కాకుండానే మొదలుపెట్టిందంటే, అసలు ప్రాజెక్టు అటకెక్కినా, తన చేతుల్లో భూమి…

ఉద్యమకారులకు న్యాయం జరిగేనా?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఎన్నో త్యాగాలకు, ఎన్నో పోరాటాలకు ప్రతీక. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని, తమ త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని…

వ్యవస్థ వైఫల్యానికి హెచ్చరిక ..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్ తేదీలుగా మిగిలిపోవు. అవి ఒక తరం ఆవేదనకు, ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సోమవారం న్యూ దిల్లీలో కనిపించిన దృశ్యం అలాంటిదే. దేశ అధికార కేంద్రంగా పేరొందిన ల్యూటెన్స్ దిల్లీ ప్రాంతం ఒక్కసారిగా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జనప్రవాహంతో నిండిపోయింది. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి…

ఈ నెత్తుటి మరకలు ఎక్కడివి?

అసహనం మనుష్యుల కే కాదు!ప్రభుత్వాలకి ఉంటుంది? మానసిక వైకల్యం మనుష్యులకే కాదు!వ్యవస్థలు కూడా ఒక్కోసారి అలా మారిపోతుంటాయి.ముఖ్యంగా అధికారం పోగుపడ్డ అహంకారం గాయపడ్డప్పుడు చేష్టలే కాదు భాష కూడా విచలితం అవుతుంటుంది.ఇప్పుడు తెలంగాణలో నెత్తుటి భాష రాజ్యం ఏలుతుంది.. నెత్తుటి మరకలు రాజకీయ చరిత్ర ముఖం మీద పుట్టుమచ్చలు,పెట్టుమచ్చలు అవబోతున్నాయి.తెలంగాణానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోకూడా అదే…

కమిషన్ లు కాలయాపనేన కోసమేనా  ..? 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటి. తెలంగాణలో సాగునీటి విస్తరణ, రైతుల సంక్షేమం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, కాలక్రమేణా రాజకీయ ఆరోపణలు, ఆర్థిక అవకతవకల అనుమానాలు, సాంకేతిక లోపాల చర్చలతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తాజా…

హైడ్రాకు చట్టబద్ధ పాలన మీద నమ్మకం లేదా?

“దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కుఖ్యాతి పొందిన “బుల్డోజర్ రాజ్యాన్ని” తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఘనత హైడ్రాదే. ఆస్తి హక్కుకు చట్టబద్ధత ఉన్న సమాజంలో ఆస్తి మీద దాడులు, ఆ ఆస్తికి ధృవీకరణ ఉన్నదా లేదా అనే వివాదానికి మాత్రమే కాదు, అసలు ఆ దాడి ఉద్దేశాలు సరైనవేనా కాదా అనే…