“ఒకే రకమైన తప్పుడు పనులు చేసే ఇద్దరి మధ్య తగాదా వస్తే రసవత్తరంగా ఉంటుంది. నువ్వది చేయలేదా అంటే నువ్వది చేయలేదా అని ఒకరు చేసిన పనులను ఒకరు బైట పెట్టుకుంటారు. వాళ్లిద్దరూ రాజకీయ నాయకులు కూడా అయితే ఆ తగాదాతో ప్రజలకు తెలియవలసిన ఎన్నో విషయాలు, ఇన్నాళ్లూ తెలియకుండా ఉండిపోయిన రహస్యాలు ఎన్నో తన్నుకుంటూ బైటికొస్తాయి. ‘తాగినోడి నోట నిజం తన్నుకుంట వస్తాదన్నా’ అని పాత సినిమా పాట అన్నట్టు, రాజకీయ వివాదం కూడా ఒక రకం మద్యపానపు మైమరపే గనుక నిజాలెన్నో బైట పడుతుంటాయి. రాజకీయ నాయకులను అలా పిలిస్తే కొందరికి కోపం రావచ్చు గనుక అలా పిలవను గాని, దొంగలూ, దోపిడీదారులూ, నేరస్తులూ, హంతకులూ, కుట్రదారులూ అప్పుడప్పుడైనా వారిలో వారు కలహించుకుంటే ప్రజలకు చాలా ఉపయోగకరం…”
ఒకే రకమైన తప్పుడు పనులు చేసే ఇద్దరి మధ్య తగాదా వస్తే రసవత్తరంగా ఉంటుంది. నువ్వది చేయలేదా అంటే నువ్వది చేయలేదా అని ఒకరు చేసిన పనులను ఒకరు బైట పెట్టుకుంటారు. వాళ్లిద్దరూ రాజకీయ నాయకులు కూడా అయితే ఆ తగాదాతో ప్రజలకు తెలియవలసిన ఎన్నో విషయాలు, ఇన్నాళ్లూ తెలియకుండా ఉండిపోయిన రహస్యాలు ఎన్నో తన్నుకుంటూ బైటికొస్తాయి. ‘తాగినోడి నోట నిజం తన్నుకుంట వస్తాదన్నా’ అని పాత సినిమా పాట అన్నట్టు, రాజకీయ వివాదం కూడా ఒక రకం మద్యపానపు మైమరపే గనుక నిజాలెన్నో బైట పడుతుంటాయి. రాజకీయ నాయకులను అలా పిలిస్తే కొందరికి కోపం రావచ్చు గనుక అలా పిలవను గాని, దొంగలూ, దోపిడీదారులూ, నేరస్తులూ, హంతకులూ, కుట్రదారులూ అప్పుడప్పుడైనా వారిలో వారు కలహించుకుంటే ప్రజలకు చాలా ఉపయోగకరం.
‘కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ, ‘రేవంత్ కుటుంబ సభ్యులకు 308 ఎకరాల భూమి ఉంది’ అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఆరోఫణ ఒకేరోజు మన పత్రికల పతాక శీర్షికల్లో వార్తలయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమిని 22ఏ కింద నిషిద్ధ భూములుగా ఎందుకు ప్రకటించిందని జరుగుతున్న చర్చకు సమాధానంగా శాసనసభా వేదిక మీద ముఖ్యమంత్రి ఆ విషయం మాత్రం వదిలేసి ప్రత్యర్థుల భూముల లెక్కలు చెప్పారు. “కెసిఆర్ కుటుంబానికి 67.13 ఎకరాలు, కెటిఆర్ కుటుంబానికి 123.19 ఎకరాలు, కవిత కుటుంబానికి 37.26 ఎకరాలు, హరీష్ రావు కుటుంబానికి 30.16 ఎకరాలు, జోగినపల్లి కుటుంబానికి 79.20 ఎకరాలు, నవీన్ కుమార్, కొండల్ రావు కుటుంబానికి 101.14 ఎకరాలు – మొత్తం ఆరు కుటుంబాలకూ కలిపి 9 జిల్లాల్లో, 24 మండలాల్లో, 31 గ్రామాల్లో 439.30 ఎకరాలు ఉన్నాయ”ని అన్నారు.
కచ్చితంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాటల ప్రకారమే ఇదంతా “కేసిఆర్ కుటుంబం” అనడానికి వీలు లేదు. ఆయన కొడుకు, కూతురు వివాహిత మేజర్లుగా వారి వారి కుటుంబాలున్నాయి. మిగిలిన మూడు కుటుంబాలు సమీప బంధువులవే గాని వేరువేరు కుటుంబాలే. ఒక కుటుంబ యూనిట్ కు భూగరిష్ట పరిమితి చట్టం నిర్దేశించిన 54 ఎకరాల కుష్కి, 27 ఎకరాల తరి కన్నా ఎక్కువ భూమి ఉంటే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. లేదా ఈ భూమిలో ఏదైనా ఒక భాగాన్ని వారి ఎన్నికల అఫిడవిట్లలో చూపకపోయి ఉంటే, ఆ తర్వాత సంపాదించినది అధికారంలో ఉన్నప్పుడు చూపిన ఆదాయానికి మించిన ఆస్తిగా ఉంటే అది ప్రశ్నించవలసి ఉంటుంది.
“ఈ కొట్లాట ఇంకా ఎక్కువ రోజులు జరిగి ఇంకా ఎక్కువ సమాచారం బైటికి వస్తే బాగుంటుంది. ఇప్పటికీ బైట పడినవి మచ్చుకు మాత్రమే. రాష్ట్రంలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల అక్రమాస్తుల గురించి ప్రజలకు సంపూర్ణంగా తెలియాలి. ప్రజాసేవ చేస్తామనీ, ప్రజలకు ప్రతినిధులమనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనీ అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల నాయకులూ ఆస్తులు పోగేసుకోవడమే ఏకైక ధ్యేయంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఆర్జించారో ప్రజలకు తెలియాలి. ఇలా బైటపడుతున్నవన్నీ పూర్తి నిజాలు అని ఎవరికీ భ్రమలు ఉండనక్కరలేదు. ఇందులో అతిశయోక్తులు, అర్ధసత్యాలు, అబద్ధాలు కూడా ఉండవచ్చు. అదే సమయంలో ఇవన్నీ పూర్తి అబద్ధాలేమో అనే అనుమానం కూడా ఎవరికీ ఉండనక్కర లేదు. ఈ ఆరోపణల్లో సగమో, ముప్పాతికో నిజాలేనని ఆయా రాజకీయ నాయకులను చూసేవారందరికీ తెలుసు..”
అలాగే బినామీల పేర్లతో వందలాది ఎకరాల భూములను కేసీఆర్ ఆక్రమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూమిని, అసైన్డ్, ఇనామ్, వక్ఫ్, భూదాన్ భూములను, జీఓ 111 పరిధిలోని భూమిని బిఆర్ఎస్ నాయకులు తమ భూమిగా చూపుకున్నారని, 2017 భూరికార్డుల ప్రక్షాళన సమయంలో, ధరణి సహాయంతో ఈ భూములు తమ పేరు మీదికి, బినామీల పేరు మీదికి బదలాయింపు జరిగిందని అన్నారు. మైహోమ్ రామేశ్వర రావు కేసీఆర్ కు బినామీ అని పది పన్నెండు సంవత్సరాలుగా లోకం కోడై కూసిన మాటనే రేవంత్ రెడ్డి మరొకసారి అన్నారు. ఎయిర్ పోర్ట్ కు ఆనుకుని ముచ్చింతల్, పాలమాకుల, మదనపల్లి, తూప్రాన్, వెంకన్నగూడ, గొల్లూరు, నాగారం గ్రామాల్లో, కాప్రాలో రామేశ్వర రావు దాదాపు మూడు వేల ఎకరాల భూమిని కంపెనీల పేరు మీద కొనుగోలు చేశారని అన్నారు. కేసిఆర్ కుటుంబ సభ్యులతో పాటు బిఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి, బిజెపి నాయకులు కిషన్ రెడ్డి, కొమరయ్య వంటి పేర్లు కూడా ప్రస్తావించారు.
కేటీఆర్ నివాసం ఉంటున్న జన్వాడ ఫామ్ హౌజ్ భూమి వాస్తవంగా సత్యం రామలింగరాజుకు చెందిన ఒక కంపెనీదని, సత్యం కుంభకోణం, పతనం తర్వాత ఆ భూమిని ఐటీ శాఖ అటాచ్ చేసిందని, అటాచ్మెంట్ లో ఉన్న భూమికి సడలింపు ఇచ్చి కేటీఆర్ బినామీలకు కట్టబెట్టారని, ఇప్పుడు ఆ భూమి వారిదేనని, దాన్ని తాను లీజుకు తీసుకుని ఫామ్ హౌజు నిర్మించుకున్నానని కేటీఆర్ అంటున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత కాంగ్రెస్ నాయకులు జన్వాడ ఫామ్ హౌజ్ దగ్గరికి, ఇతర బిఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజుల దగ్గరికి కాంగ్రెస్ నాయకులు వెళ్లారు.
ఈ ఆరోపణలకు ప్రతిగా “రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక మూడేళ్లలో రేవంత్ రెడ్డి సంపాదించిన ఆస్తులతో పాటు మా ఆస్తులు, ధరణి – భూభారతిలో జరిగిన వ్యవహారాల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా” అని హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, ఆయన కూతూరు, తమ్ముళ్ల పేరుతో 308 ఎకరాల భూమి ఉందన్నారు. కొట్ర, కొండారెడ్డి పల్లి, నాదర్గుల్ వంటి అనేక గ్రామాలలో రేవంత్ రెడ్డి భూ ఆక్రమణల గురించి తమ దగ్గర ఆధారాలున్నాయని అన్నారు.
రేవంత్ రెడ్డి ఆరోపణలన్నీ బిఆర్ఎస్ లేవనెత్తుతున్న నిజమైన ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికేనని, తాము ఆ ఉచ్చులో పడబోమని అంటూనే, బిఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్, కావాలంటే తాము కూడా కాంగ్రెస్ లాగనే ప్రతినిధివర్గాలను తీసుకుని ప్రైవేటు ఆస్తుల మీదికి వెళ్లగలమని హెచ్చరిక చేసి, తమ దృష్టిలో ఉన్న కాంగ్రెస్ నాయకుల అక్రమ ఆస్తుల జాబితా బైటపెట్టారు. జీఓ 111 పరిధి లోపల వట్టినాగుల పల్లిలో రేవంత్ రెడ్డి ఫామ్ హౌజ్, హిమాయత్ సాగర్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డా. వివేక్ ల ఫామ్ హౌజులు, జీఓ 111 పరిధిలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌజు, కొత్వాల్ గూడలో అసైన్డ్ భూమిలో పట్నం మహేందర్ రెడ్డ్ ఫామ్ హౌజ్, కొత్వాల్ గూడ లో అటవీ భూమిలో ప్రకాష్ గౌడ్ నివాస భవనం, వేం నరేందర్ రెడ్డి ఆక్రమణలో ఉన్న అసైన్డ్ భూమి, రెడ్డి పల్లిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌజ్ ఈ జాబితాలో ఉన్నాయి.
“మిగిలిన ఆస్తులన్నిటినీ మించినది భూమి. దాని సరఫరాకు ఒక అవధి ఉంది గనుక దాని కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. అందువల్ల దాని ధర విపరీతంగా పెరుగుతుంది. అందులోనూ ఎకరాల్లో కొన్నప్పటి ధరకూ, గజాల్లో అమ్మినప్పటి ధరకూ మధ్య వ్యత్యాసం వల్ల అత్యంత సులభంగా అందలాలు ఎక్కించగల అపారమైన శక్తి ఉన్న వనరు భూమి. అయితే ఇది పిడికెడు మంది రాజకీయ నాయకులకూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకూ, దలారీలకూ, పెట్టుబడిదారులకూ, దేశదేశాల సంపన్నులకూ వర్తించే బంగారు బాతు ఆస్తి. కాని మన్ను పిసికి, మన్ను బుక్కి, మన్నులో మన్నై, మంటి నుంచి మాణిక్యాల పంటలు తీసే చిన్న, సన్నకారు రైతులకు, కూలీలకు భూమి అంటే ఆస్తి మాత్రమే కాదు, జీవనాధారం, గౌరవం, ఆత్మగౌరవం, వారసత్వం, కొనసాగింపు, ఒక్క మాటలో జీవితం, వ్యక్తిత్వం. వారి నుంచి దాన్ని లాక్కోవడానికి, వారిని బేదఖల్ చేసి ఆ భూమిలో కబ్జా పెట్టడానికి, హిరణ్యాక్షుడిలా దాన్ని చాప చుట్టి, దాని మీద కూచుని అధికారం చలాయించడానికి భూస్వామ్య, సంపన్న, ఆధిపత్య వర్గం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది..”
ఈ కొట్లాట ఇంకా ఎక్కువ రోజులు జరిగి ఇంకా ఎక్కువ సమాచారం బైటికి వస్తే బాగుంటుంది. ఇప్పటికీ బైట పడినవి మచ్చుకు మాత్రమే. రాష్ట్రంలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల అక్రమాస్తుల గురించి ప్రజలకు సంపూర్ణంగా తెలియాలి. ప్రజాసేవ చేస్తామనీ, ప్రజలకు ప్రతినిధులమనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనీ అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల నాయకులూ ఆస్తులు పోగేసుకోవడమే ఏకైక ధ్యేయంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఆర్జించారో ప్రజలకు తెలియాలి. ఇలా బైటపడుతున్నవన్నీ పూర్తి నిజాలు అని ఎవరికీ భ్రమలు ఉండనక్కరలేదు. ఇందులో అతిశయోక్తులు, అర్ధసత్యాలు, అబద్ధాలు కూడా ఉండవచ్చు. అదే సమయంలో ఇవన్నీ పూర్తి అబద్ధాలేమో అనే అనుమానం కూడా ఎవరికీ ఉండనక్కర లేదు. ఈ ఆరోపణల్లో సగమో, ముప్పాతికో నిజాలేనని ఆయా రాజకీయ నాయకులను చూసేవారందరికీ తెలుసు. అసలు ఇప్పుడు రాజకీయాలు ఎంత లాభసాటి వ్యాపారంగా మారిపోయాయో, ప్రజాధన కైంకర్యానికీ, ప్రజల సామూహిక ఆస్తుల, వనరుల కబ్జాకూ రాజకీయ పదవి ఎటువంటి సాధనమో ప్రతి ఒక్కరికీ తెలుసు. తమ బస్తీలో, వాడలో, గ్రామంలో జులాయిగా, ఎందుకు పనికిరానివాడని పేరు తెచ్చుకున్న వ్యక్తి రాజకీయ నాయకుడై ఎన్ని బంగళాలు, ఎన్ని ఖరీదైన వాహనాలు, ఎన్ని సొంత, బినామీ ఆస్తులు ఎంత తక్కువ వ్యవధిలో సంపాదించాడో ప్రజల్లోకి వెళ్తే కథలు కథలుగా చెపుతారు.
మిగిలిన ఆస్తులన్నిటినీ మించినది భూమి. దాని సరఫరాకు ఒక అవధి ఉంది గనుక దాని కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. అందువల్ల దాని ధర విపరీతంగా పెరుగుతుంది. అందులోనూ ఎకరాల్లో కొన్నప్పటి ధరకూ, గజాల్లో అమ్మినప్పటి ధరకూ మధ్య వ్యత్యాసం వల్ల అత్యంత సులభంగా అందలాలు ఎక్కించగల అపారమైన శక్తి ఉన్న వనరు భూమి. అయితే ఇది పిడికెడు మంది రాజకీయ నాయకులకూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకూ, దలారీలకూ, పెట్టుబడిదారులకూ, దేశదేశాల సంపన్నులకూ వర్తించే బంగారు బాతు ఆస్తి. కాని మన్ను పిసికి, మన్ను బుక్కి, మన్నులో మన్నై, మంటి నుంచి మాణిక్యాల పంటలు తీసే చిన్న, సన్నకారు రైతులకు, కూలీలకు భూమి అంటే ఆస్తి మాత్రమే కాదు, జీవనాధారం, గౌరవం, ఆత్మగౌరవం, వారసత్వం, కొనసాగింపు, ఒక్క మాటలో జీవితం, వ్యక్తిత్వం. వారి నుంచి దాన్ని లాక్కోవడానికి, వారిని బేదఖల్ చేసి ఆ భూమిలో కబ్జా పెట్టడానికి, హిరణ్యాక్షుడిలా దాన్ని చాప చుట్టి, దాని మీద కూచుని అధికారం చలాయించడానికి భూస్వామ్య, సంపన్న, ఆధిపత్య వర్గం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. చదువు లేని సమాజంలో వాళ్లు మాత్రమే చదువుకున్నారు గనుక, లేదా చదువుకున్నవారిని కిరాయికి పెట్టుకున్నారు గనుక వందల, వేల, లక్షల ఎకరాలు తమ పేరు మీద రాసుకున్నారు. ఎన్నడూ చూడని గ్రామాల్లో, ఎన్నడూ స్పృశించని భూమి మీద తమదే అధికారం అని కాగితాల మీద రాసుకున్నారు. అలా సమాజం ఒకపక్కన కొద్దిమంది వేలాది ఎకరాల భూస్వాములు, మరొకపక్కన కోట్లాది భూమిలేని నిరుపేద కౌలుదార్లు, కూలీలుగా చీలిపోయింది. భూయాజమాన్యంలో ఆ అసమానత రద్దు చెయ్యడానికి కొమురం భీమ్, బందగీ, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, గుత్పల సంఘం, ఆంధ్ర మహాసభ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తండ్లాటే ఈ గడ్డ చరిత్ర. తర్వాత కూడా భూమి కోసమే వేలాది మంది వీరయోధులు ప్రాణాలు బలిపెట్టారు. నాయకులు విఫలమయ్యారో, ఓడిపోయారో, అలసిపోయారో, ఆగిపోయారో గాని, ప్రజల భూఆకాంక్షలేమీ తీరలేదు. పాలకుల భూదాహమూ, అధికార దాహమూ ఇంకా అట్లాగే ఉన్నాయి. భుక్తిగా భూమికీ, అధికారంగా భూమికీ మధ్య ఘర్షణ కూడా ఆగలేదు.
ఇదంతా భూమి సమస్య. భూమిని ఎవరెవరు ఎలా చెరపడుతున్నారనేది, గరిష్ట పరిమితి ఉన్నప్పటికీ ఎట్లా వందల ఎకరాలు పోగేసుకుంటున్నారనేది బైటపడుతున్నది. ప్రస్తుతం కులం ఎక్కడుంది అని అడిగే అమాయకుల లాగనే, భూస్వాములు ఎక్కడున్నారు, భూమి కావాలని ఎవరనుకుంటున్నారు అని నిలదీసే మేధావులూ ఉన్నారు. రాజకీయ నాయకులను చూడండి, వాళ్ల కుటుంబాలనూ, బినామీలనూ చూడండి. యాబై లక్షల ఎకరాల మీర్ ఉస్మాన్ అలీఖాన్, లక్షన్నర ఎకరాల జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, నలబై వేల ఎకరాల విసునూరు రామచంద్రారెడ్డి లేకపోవచ్చు గాని వారితో పోటీ పడగలిగినవారున్నారు!





