ఎన్‌డీడీబీతో ‘నార్ముల్’ త్రైపాక్షిక ఒప్పందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)తో త్రైపాక్షిక ఒప్పందం కుదర్చుకుంది. 15 ఏళ్లపాటు డెయిరీని అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్‌డీడీబీ తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు రూ.10 కోట్లను చెల్లించనుంది. ఎన్‌డీడీబీ అధికారులతో రాష్ట్ర డెయిరీ విభాగం అధికారులు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ సెక్రటరీ ఇలంబర్తి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఎన్‌డీడీబీ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *