– దీనిపైౖ సమగ్ర విచారణ చేపట్టాలి
– ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : దేశవ్యాప్తంగా ‘నీట్’ రద్దు కావడంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 3న జరిగిన పరీక్షను రద్దు చేశారన్నారు. పరీక్ష రద్దుకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉందన్నారు. ‘నీట్’ రద్దుపై బీజేపీ ప్రభుత్వం చర్చ చేపట్టాలన్నారు. దేశంలో అనేక విషయాలపై చర్చ చేసే బీజేపీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై సమాధానం చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. బీజేపీకి పాలనపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుడి అవసరం బీజేపీకి వద్దా అని నిలదీశారు. ‘నీట’ రద్దుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్‌లు ఇప్పించి పరీక్ష రాయించారని తెలిపారు. రాజస్థాన్‌లో ‘నీట’ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



