– దక్షిణాఫ్రికాకు చెందిన నవీ పిళ్లై ఎంపిక
దిల్లీ, అక్టోబర్ 9 : దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది, భారత మూలాలున్న నవనీతం నవీ పిళ్లైను 2026 సంవత్సరం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు ఈ పురష్కారానికి ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. నవనీతమ్ అంతర్జాతీయంగా మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేశారు. ఈమె పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు కాగా చాలా ఏళ్ల క్రితం అక్కడినుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. ఆమె పూర్వీకులు 1890లో దక్షిణాఫ్రికాలోని చక్కెర తోటలలో పనిచేయడానికి ఒప్పంద సేవకులుగా భారతదేశం నుంచి వెళ్లారు. దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేసిన తొలి భారతీయ సంతతి మహిళల్లో ఒకరుగా, 1995లో ఆ దేశ హైకోర్టులో నియమితులైన తొలి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. రువాండా అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) న్యాయమూర్తి (2003-2008)గా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ (2008-2014)గా పనిచేశారు. ఈమె తల్లిదండ్రులు శాంతమ్మ నాయుడు, నారాయణస్వామి నాయుడు. 1941 సెప్టెంబర్ 23న ఈమె దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్స్‌లోని డర్బన్‌లో జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘర్షణలు దౌత్యం, ఒప్పందాలు, చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కారం అవుతున్నాయని నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. మరింత శాంతియుత ప్రపంచానికి అంతర్జాతీయ చట్టం ఓ పునాది అని, ప్రస్తుతం అనేక సంఘర్షణలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఇది అత్యంత అవసరమని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు కొరినా మచాడోను ఈ నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





