#- నిజాయతీగా విద్యుక్త ధర్మం నిర్వహించండి
– సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర
న్యూదిల్లీ, జూలై 30 : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విధుల్లో దైర్యసాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి సన్మానం చేసిన కార్యక్రమంలో ఆయన ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఎలాంటి భయం లేకుండా పనిచేయాలని బలగాలకు పిలుపునిచ్చారు. సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్‌గా ఇక్కడ నేను మీకో హామీ ఇస్తున్నాను. విధులు నిజాయతీగా నిర్వర్తించడంలో రు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు నేను బాధ్యత వహిస్తాను. ప్రజాప్రయోజనం కోసం తీసుకునే చర్యలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తే.. దానిని నేను పూర్తిగా స్వీకరిస్తానని జ్ఞానేంద్ర తన సిబ్బందిని ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ నెల 20న ‘చలో పార్లమెంటు’ నిరసనల సమయంలో భద్రతా విధులు నిర్వర్తించిన సీఆర్పీఎఫ్-ఆర్‌ఏఎఫ్ బలగాలు, పోలీసులు విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమవుతోన్న వేళ జ్ఞానేంద్ర ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ అంతకుముందు కూడా స్పందించారు. ఏదైనా భారీ ఆపరేషన్ తర్వాత తాము వృత్తిపరమైన మూల్యాంకనం చేపడతామని చెప్పారు. నిరసనకారులపై ఆర్‌ఏఎఫ్ సిబ్బంది తీసుకున్న చర్యల విషయంలోనూ ఆ పరిశీలన చేస్తామని తెలిపారు. అది తమ నిబంధనల్లో భాగమేనని చెప్పారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో సహకరిస్తూ.. వైవిధ్య పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా స్పందించగల సామర్థ్యం వారి సొంతం. ఇక, ఏదైనా ప్రాంతంలో ఘర్షణలు, రద్దీ, అశాంతియుత పరిస్థితులను నెలకొన్నప్పుడు వాటిని నియంత్రించేందుకు సీఆర్‌పీఎఫ్‌లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


