– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
– ఉప్పల్ లో రూ.76.46 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– అభివృద్ధి పనులను నాణ్యతతో గడువులో పూర్తి చేయాలని
మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 30: ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు, ఆధునిక పౌర సేవలు అందించడమే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గలో రూ.76.46 కోట్ల విలువైన పలు అభివృద్ధి నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. రామంతాపూర్ – బజరంగ్ వ్యాయామశాల గ్రౌండ్ ఫ్లోర్ విస్తరణ, బోర్వెల్ ఏర్పాటు. ఆధునిక జిమ్ పరికరాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రామంతాపూర్ భగాయత్ ఉప్పల్ రూ.56.355 కోట్ల తో ప్రధాన స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణం, ఫుట్ పాత్‌ల అభివృద్ధి, మల్టీ స్పోర్ట్స్ అరేనా నిర్మాణం, పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వి.టి. కమాన్ వద్ద బస్ స్టాప్ అభివృద్ధి. బొడ్రాయి – చిలకనగర్ – బీరప్పగడ్డ రూ.3.23 కోట్ల తో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులు, స్టార్మ్ వాటర్ డ్రైన్ల పునర్నిర్మాణం, రిటైనింగ్ వాల్, స్టీల్ గిర్డర్ వంతెన నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి పనులు, చర్లపల్లి (రూ.15.97 కోట్లతో చర్లపల్లి, వాంపుగూడ, కాప్రా ప్రాంతాల్లో కల్వర్టుల పునర్నిర్మాణం, బలోపేతం, విస్తరణ, టెర్షియరీ స్టార్మ్ వాటర్ డ్రైన్ల నిర్మాణం, పునర్నిర్మాణం, ఆర్సీసీ పైడ్లైన్ల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం అభివృద్ధి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి మల్కాజ్గరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, కీసర డివిజన్ ఆర్డీఓ, ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు, డిప్యూటీ కమిషనర్ (ఉప్పల్) ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు తోపాటు మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





