– స్కూల్ పిల్ల భద్రత యాజమాన్యాలదే బాధ్యత
– యాజమాన్యాలతో భేటీఓ సీపీ సజ్జన్నార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19:మైనర్లు డ్రైవింగ్ చేస్తే అస్సలు క్షమించమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘స్కూల్ పిల్లల భద్రత’పై స్కూల్ యాజమాన్యాలు, సంబంధిత శాఖలతో ట్రాఫిక్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిటీ పరిధిలో 3500లకు పైగా స్కూల్స్ ఉన్నాయని, వీటిలో 12 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. సేఫ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పాటించడం అన్నది అలవాటుగా మారాలని సూచించారు. విద్యాసంస్థల్లో ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదని.. సేఫ్ ఎన్విరాన్మెంట్ ముఖ్యమని సీపీ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడుతున్నారని తెలిపారు. విద్యార్థులు స్కూల్‌కు ఏ విధంగా వస్తున్నారనే దానిపై స్కూల్ యాజమాన్యం వద్ద పూర్తి రూట్‌మ్యాప్ ఉండాలన్నారు. పిల్లలు పాఠశాలకు వస్తున్నారంటే.. ఏం జరిగినా స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. స్కూల్ బస్సులను నడిపే డ్రైవర్స్‌పై నిఘా ఉంచాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ వాలంటీర్లు, మార్షల్స్‌ను విద్యాసంస్థలు నియమించుకోవాలని అన్నారు. పిల్లలు తెలిసీ తెలియక నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారని.. పిల్లలపై టీచర్స్, పేరెంట్స్ పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. స్కూల్ పరిసరాల్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. స్కూల్ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని, అలాంటి వాటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 45 మంది విద్యార్థులు యాక్సిడెంట్లో చనిపోతున్నారని, యాక్సిడెంట్లు మర్డర్ల కంటే ప్రమాదకరమన్నారు. అందుకే స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.