చిట్టీల వ్యాపారం చేస్తున్న టీచర్ సస్పెన్షన్

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 19 : భీమదేవరపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అనేక సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తూ చిట్టీ సభ్యులను మోసం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.గిరిరాజ్ గౌడ్ ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే నిబంధనలకు విరుద్ధంగా చిట్టీ వ్యాపారం నిర్వహిస్తూ గడువు ముగిసిన కూడా సభ్యులకు డబ్బులు చెల్లించకుండా మోసం చేసినందున బాధితులు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. విచారణలో చిట్టీలు నిర్వహించింది వాస్తవమేనని, సభ్యులను మోసం చేసిన అక్రమాలు రుజువు కావడంతో ఎల్లయ్యను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూనే ఇలా ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు జిల్లాలో అనేకమంది ఉన్నారని, వారి మీద కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *