– వ్యాధిగ్రస్తులకులకు అండ ప్రభుత్వం
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలో 2,492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నామని, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. దేశంలో క్షయ, మాతాáశిశు సంరక్షణ, నివారణ కార్యక్రమాలపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. క్షయ నిర్ధారణ పరీక్షలు (ఎక్స్‌రే, తెమడ పరీక్షలు) అనుమానితులందరికీ నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్సతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెలా రూ.వెయ్యి నిక్షయ పోషణ యోజన కింద అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా తెలిపారు. రాష్ట్రంలో పౌష్టికాహారం కోసం ఫుడ్ బాస్కెట్‌లను బాధితులకు అందిస్తున్నావని, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దామోదర్ అన్నారు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మాతృ మరణాలను, నవజాత శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు. ఆర్‌బీఎస్‌కే బృందాల ద్వారా 0-18 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రికి దామోదర్ వివరించారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ముందే గుర్తించి గర్భిణులకు బర్త్ ప్లానింగ్ కోసం కావాల్సిన సదుపాయాలను అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో యాంటీ యాటల్ చెకప్ (ఏఎన్‌పీ)లను విధిగా నాలుగుసార్లు నిర్వహిస్తున్నామన్నారు. జన్యుపరమైన రుగ్మతలు (సికిల్ సెల్, తలసేమియా) ముందుగానే గుర్తించటానికి హెల్త్ చెకప్ చేస్తున్నామని మంత్రి దామోదర్ తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి వాటిని గుర్తించటానికి హెల్త్ స్క్రీనింగ్, హెల్త్ చెకప్, ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు. నవజాత శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీబీ కంట్రోల్ జేడీ రాజేశంలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




