సాహిత్య సమాచారం
డాక్టర్ నలిమెల భాస్కర్ చేసిన పరిశోధనలు ఇపుడు పుస్తకరూపంలో వస్తున్నాయి. ‘తెలుగులో సామెతలు- ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశోధన’ (ఎంఫిల్), ‘తెలుగు, మలయాళ సామెతల కుటుంబ జీవన చిత్రము’ (పిహెచ్ డి) గ్రంథాలను- 28-6-2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు కరీంనగర్లోని ఫిలింభవన్లో ఆవిష్కరిస్తారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కు నలిమెల బుచ్చమ్మ- రామచంద్రం స్మారక తొలి పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సభకి ముఖ్యఅతిథి, ఆవిష్కర్త ఆచార్య ఎన్. గోపి. నగునూరి శేఖర్ అధ్యక్షత వహిస్తారు, ఆచార్య ఎస్. రఘు, గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, రవి ఠాకూర్ పాల్గొంటారు.
సాహితీ సోపతి, కరీంనగర్




